Advertisement
Google Ads BL

అసలు గేమ్ ఛేంజర్ చరణ్ కాదు


గతంలో దిల్ రాజు-శంకర్ కలయికలో ఎంతో గ్రాండ్ గా కమల్ హీరోగా ఇండియన్ 2 మొదలయ్యింది. కానీ మధ్యలో దిల్ రాజు తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి లైకా నిర్మాణ సంస్థ వచ్చి చేరింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఇండియన్ 2 షూటింగ్ ఆగిపోవడంతో దిల్ రాజు తో శంకర్ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టి ఆయన్ని కలవగా.. దిల్ రాజు కి ఆయన గేమ్ ఛేంజర్ కథ వినిపించారు.

Advertisement
CJ Advs

అయితే ఆ కథకి ముందుగా చరణ్ ని అనుకోలేదు. మొదట కథ చెప్పినప్పుడు ఇలాంటి కథకు పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది అని శంకర్ తన ఆలోచన నాకు చెప్పారు అంటూ దిల్ రాజు చెబుతున్నారు. నేను మాత్రం పవన్ కి ఈ కథ కరెక్ట్ కాదు అని రామ్ చరణ్ అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చాను. శంకర్ గారు కూడా రామ్ చరణ్ తో మాట్లాడి కథను చెప్పడంతో.. చరణ్ శంకర్ కథకి బాగా కనెక్ట్ అయ్యాడు. 

ఇక ఆ తర్వాత ఈ సినిమాను పాన్ ఇండియాకు తగ్గట్టుగా తెరపైకి తీసుకురావాలి అని ఫిక్స్ అయ్యి మొదలు పెట్టినట్లుగా దిల్ రాజు #AskDilRaju చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు. అలా పవన్ తో అనుకున్న ప్రాజెక్ట్ ఫైనల్ గా చరణ్ తో సెట్ అయ్యిందన్నమాట.

Charan is not a real Game Changer:

Ram Charan is not a real Game Changer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs