విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత సుకుమార్ తో సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ-సుకుమార్ కాంబో మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పుష్పతో సుకుమార్, లైగర్ తో విజయ్ బిజీ అయ్యారు. తర్వాత విజయ్ శివ నిర్వాణ ప్రాజెక్ట్ ప్రకటించడం, సుకుమార్ పుష్ప 2 తో బిజీగా అవడం చూసాం. మధ్యలో విజయ్ దేవరకొండ పూరి తోనే జన గణ మన ప్రాజెక్ట్ మొదలు పెట్టెయ్యడంతో సుకుమార్ తో విజయ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకున్నారు.
నిజంగానే అధికారిక ప్రకటన తర్వాత విజయ్ దేవరకొండ- సుకుమార్ ప్రోజెక్ట్ పై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అందరూ అదే అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ-సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిపోలేదట. వీరిద్దరూ రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్నారట, చాలా నెలల క్రితమే అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆన్ లోనే ఉంది, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. ఎప్పటినుండో ఈ కాంబో కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఈ ప్రాజెక్ట్ ఇంకా ట్రాక్‌లో ఉందని తెలిసి సంబర పడుతున్నారు.
అయితే విజయ్ దేవరకొండ ఖుషి, అలాగే గౌతమ్ తో VD12 పూర్తికాగానే సుక్కు ప్రాజెక్ట్ లోకి వెళతాడని, ఈలోపు సుకుమార్ పుష్ప 2 కంప్లీట్ చేసుకుని విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ మొదలు పెడతారని తెలుస్తుంది.