ఫిబ్రవరిలో ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన బాలీవుడ్ క్యూటీ కియారా అద్వానీ.. ఆ తర్వాత అత్తమామల ఇంటికి, ముంబై రిసెప్షన్ అంటూ హడావిడి చేసింది. ఆ వెంటనే వర్క్ లోకి దిగిపోయింది. సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ అంటూ సీక్రెట్ ని మెయింటింగ్ చేస్తూనే పెళ్లి పీటలెక్కేసిన కియారా అద్వానీ పెళ్లి తరవాత హనీమూన్ అంటూ షూటింగ్స్ కి గ్యాప్ తీసుకుంటుంది అనుకున్నారు. కానీ హనీమూన్ లేదు ఏమి లేదు అంటూ కియారా అద్వానీ, సిద్దార్థ్ లు ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.
తాజాగా వీరిద్దరూ రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం జంటగా హైదరాబాద్ వచ్చారు. RC15 సాంగ్ షూట్ పూర్తి చేసిన కియారా తర్వాత ముంబైకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ నుండి కియారా మరో ప్రాజెక్ట్ సత్యప్రేమ్ కి కథ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం మంచు మధ్యన కాశ్మీర్ లో ఈ షూటింగ్ జరుగుతుండగా.. కియారా అద్వానీ.. ఆ మంచు మధ్యన కూర్చుని ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ పిక్ చూసిన వారు కొత్త పెళ్లి కూతురు కియారా అద్వానీ భర్త లేకుండా మంచులో ఒంటరిగా, పాపం కియారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కియారా మంచు నుండి రక్షణగా.. తన బాడీని ఫుల్ గా కవర్ చేసుకుని నవ్వులు చిందిస్తుంది. ఆమె చుట్టూ మంచు పేరుకుపోయి ఉంది. మంచులో కాశ్మీర్ అందాలని ఆస్వాదిస్తూ కియారా ఎంజాయ్ చేస్తున్న పిక్ వైరల్ గా మారింది.