Advertisement
Google Ads BL

ఎందుకు హరీష్ ఈ దాపరికం


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో హిట్ అయిన మూవీని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసిన బ్లాక్ బస్టర్ కొట్టిన హరీష్ శంకర్ మళ్ళీ ఇన్నాళ్ళకి పవన్ కళ్యణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాడు. గత మూడేళ్ళుగా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఎదురు చూసిన హరీష్ కి ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో అఫీషియల్ గా నిన్న బుధవారమే ఉస్తాద్ షూట్ మొదలైంది. అది కూడా పోలీస్ స్టేషన్ సెట్ లో మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టినట్లుగా అప్ డేట్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రం అనుకున్నపటినుండి తమిళంలో హిట్ అయిన తేరి సినిమాకి రీమేక్ గా పవన్-హరీష్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతుంది అంటూ ప్రచారం జరగడం, మధ్యలో పవన్ ఫాన్స్ హరీష్ పై ఫైర్ అవడంతో హారిష్ శంకర్ అలగడం, ఆ తర్వాత పవన్ ఫాన్స్ కి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా కామైపోవడం చూసాం. ఇప్పుడు ఉస్తాద్ మొదటి షెడ్యూల్ పోలీస్ స్టేషన్ సెట్ లో మొదలు కావడం పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో కనిపించడంతో.. హరీష్ ఆ దాపరికలెందుకు ఇది తేరి మూవీ రీమేక్ అని చెప్పొచ్చుగా అంటూ పవన్ ఫాన్స్ అప్పుడే హరీష్ ని నిలదీస్తున్నారు.

అందులో పవన్ వీరాభిమాని ఒకరి ఇలా ట్వీట్ చేసాడు..

చేసేది రీమేక్, పవన్ లుక్ చూస్తే అదే అని అర్ధమవుతుంది. కానీ ఇలా దాచడం ఎందుకో.. హారిష్ శంకర్ అందరిపై ఫైర్ అవడం కాదు.. దమ్ముంటే.. అది రీమేక్ అని ఒప్పుకో అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల-పూజ హెగ్డే హీరోయిన్స్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ విషయంపై ప్రకటన రావాల్సి ఉంది.

Why Harish Shankar is this candid:

Ustad Bhagat Singh Shooting Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs