బాలకృష్ణ సినిమాల్లో నటిస్తారు. ఆయన పారితోషకం తీసుకునే సినిమాలు చేస్తారు. అది ఆయన వృత్తి,. రాజకీయాల్లోకి వచ్చినా.. ఆయన సినిమాలు వదల్లేదు. అది అదే.. ఇది ఇదే. రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన పని ఆయన చేసుకుంటుంటే.. బాలకృష్ణ పారితోషకం తీసుకుని తైతక్కలాడితే లేదు, ఆయన కన్నా చిన్న హీరోయిన్స్ తో కలిసి డాన్స్ లు వేస్తె లేదు కానీ.. ఇప్పుడొక వైసిపి ఎమ్మెల్సీ స్టేజ్ పై రికార్డింగ్ డాన్స్ ఆడితే తప్పా అంటూ వైసీపీ అనుకూల మీడియా ఒకటి సాగదీస్తూ తప్పుని ఒప్పు చేసే ప్రయత్నాల్లో ఉంది.
ఇంతకీ అసలు ఈ మేటర్ లోకి బాలయ్యని కావాలనే లాగారంటూ నందమూరి అభిమానులు సదరు వైసీపీ మీడియాపై విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఓ జాతరలో స్టేజ్ పైకి ఎక్కి అక్కడి అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్ చేస్తూ కనిపించడంతో ప్రతి పక్షం ఆ వీడియోపై మండిపడింది. ఎమ్మెల్సీ అయ్యుండి ఇలా డాన్స్ వెయ్యడం ఏమిటి అని, పద్దతిగా ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన వాడు ఇలా చెయ్యడం తగునా అని ప్రశ్నించించినందుకు.. ఈ రొంపిలోకి బాలయ్యను లాగారన్నమాట. ఏ.. మీ బాలయ్య సినిమాలు చేస్తున్నాడు, దాని కోసం డబ్బులు తీసుకుంటున్నాడు. అంతేకాకుండా తనకన్నా సగం వయసున్న హీరోయిన్స్ తో డాన్స్ లు చేస్తున్నాడు. ఇది తప్పు కాదు కానీ.. పద్దతిగా వల్గారిటీ లేకుండా స్టేజ్ మీద సరదాగా డాన్స్ చేస్తే తప్పా అంటూ బాలయ్య మీద పడిపోతున్నారు.
మరి నిజమే బాలకృష్ణ పారితోషకం తీసుకుని డాన్స్ లు వేస్తున్నారంటే అది ఆయన వృతి. వృత్తిలో భాగంగా చేస్తున్నారు. మరి మీ వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ది ఏ వృత్తి సార్ అంటూ ప్రశ్నిస్తుంటే.. ఏమి మాట్లాడలేక బిక్కమొహాలు వేస్తున్నారు. పాపం బాలయ్యని విమర్శించామని సంబరపడిపోతూ వాళ్ళ మీద వల్లే రాళ్లు వేసుకుంటున్నారు. అది వాళ్ళకి తెలియడం లేదు అంటూ నందమూరి ఫాన్స్ వారి కామెంట్స్ ని తిప్పి కడుతున్నారు.