పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ ని మొదటి నుండి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆదిపురుష్ టీజర్ తోనే ఫాన్స్ నుండి వ్యతిరేఖత మూటగట్టుకుంది. ఓం రౌత్ పై దుమ్మెత్తిపోసేలా చేసిందా టీజర్. ప్రభాస్ ని రాముడిగా ఊహించుకుని.. టీజర్ చూసాక డిస్పాయింట్ అయ్యారు వారు. అయితే శ్రీరామ నవమి స్పెషల్ గా సీతారామసమేతంగా లక్షణుడు, ఆంజనేయుడు పోస్టర్ డిజైన్ చేసి వదిలారు మేకర్స్. మరి సీతారాములంటే ఎలా ఉంటారో.. ప్రతి ఇంట్లోనూ ఓ ఫోటో నిదర్శనంగా ఉంటుంది.
అలా విడుదల చేసిన ఆదిపురుష్ శ్రీరామనవమి పోస్టర్ పై కూడా అనేక విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ఆదిపురుష్ పోస్టర్ తమ మనోభావాలు దెబ్బతీసేవిలా ఉన్నాయంటూ ముంబైకి చెందిన సంజయ్ దీనానాథ్ తివారి ఆదిపురుష్ మేకర్స్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. రామాయణ ఇతిహాసానికి విరుద్ధంగా రాముడిని డిజైన్ చేసారు, సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యతని కలిగిన జానేవు అనే పవిత్ర దారాన్ని రాముడు కానీ.. లక్షణుడు కానీ ధరించకుండానే పోస్టర్ డిజైన్ చేసారంటూ మేకర్స్ పై సంజయ్ ఫిర్యాదు చేసాడు.
రామాయణ సహజ స్వభావానికి వ్యతిరేఖంగా ఆదిపురుష్ ని తెరకెక్కించారని, అసలు రామాయణ ఇతిహాసం తెలుసుకోకుండా ఇలా రాముడిని అవమానాలు పాలు చెయ్యడమెంత వరకు కరెక్ట్ అంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆదిపురుష్ టీజర్, పోస్టర్ కే ఇంత యుద్ధం జరిగితే.. సినిమా రిలీజ్ సమయానికి ఇంకెన్ని వివాదాలు మొదలవుతాయో అంటూ ప్రభాస్ ఫాన్స్ టెన్షన్ పడిపోతున్నారు.