Advertisement
Google Ads BL

ఏజెంట్ డేట్ చేంజ్ అవ్వబోతుందా?


అఖిల్ అక్కినేని-సురేందర్ రెడ్డి కాంబోలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మార్చుకుంటూ వచ్చింది. ఫైనల్ గా ఏప్రిల్ 28  డేట్ ఫిక్స్ చేసి AK ఎంటర్టైన్మెంట్స్ వారు అధికారికంగా ప్రకటించడమే.. సాంగ్స్ రిలీజ్ చేస్తూ హడావిడి చేసారు. అఖిల్-హీరోయిన్ సాక్షి వైదే డ్యూయెట్స్ రిలీజ్ చేస్తూ యాక్షన్ మూవీనే కాదు.. రొమాన్స్ కూడా ఉంటుంది అని సినిమాపై మరింతగా అంచనాలు పెంచారు.

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించడం, అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ, యాక్షన్ సన్నివేశాలు, ఏజెంట్ టీజర్ అన్ని సినిమాపై హైప్ ని క్రియేట్ చేసాయి. కానీ ఇప్పటివరకు సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంకా కేవలం 23 రోజులు మాత్రం రిలీజ్ కి సమయం ఉండగా.. అసలు షూటింగ్ ఇంకా 20 రోజులపాటు పెండింగ్ ఉంది అనే వార్త చూసిన అక్కినేని ఫాన్స్ ఢీలా పడిపోతున్నారు. ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ జరుగుతోంది.

ఇంకా 20 రోజుల షూట్ మిగిలి ఉన్నప్పటికీ నిర్మాతలు మాత్రం అనుకున్న తేదీకే ఖచ్చితంగా ఏజెంట్ రిలీజ్ ఉంటుంది అని అంటున్నారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. పాన్ ఇండియా రిలీజ్ అంటే ప్రమోషన్స్ ఉండాలి. కానీ పది రోజుల్లో ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా చుట్టెయ్యడం మాములు విషయం కాదు. అందుకే మళ్ళీ ఏజెంట్ రిలీజ్ వాయిదా పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

Is the Agent going to change the date?:

Akhil Akkineni Agent Release Postponed Again?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs