ఇప్పుడు తెలుగు దర్శకులు తమిళ్ హీరోలతో, ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. పర భాషా దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో భాషకి ఎల్లలు చెరిగిపోయాయి. నార్త్ డైరెక్టర్స్ కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న రోజులివి. ఇప్పుడో తెలుగు దర్శకుడు తమిళ హీరోతో ఓ సినిమా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. అది కూడా బడా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కొత్త ప్రాజెక్ట్ కి రంగం రెడీ అవుతుందట.
ఆ తెలుగు దర్శకుడు ఎవరో కాదు.. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ. రమేష్ వర్మ తమిళ హీరో రాఘవ లారెన్స్ తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి జ్ఞావవేల్ రాజా నిర్మాతగా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. సౌత్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలవనుంది అని సమాచారం.
జ్ఞానవేల్ రాజా ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్యతో ఓ గ్రాండ్ సినిమా చేస్తున్నాడు. రాఘవ లారెన్స్ కూడా చంద్రముఖి 2 షూటింగ్ లో బిజీగా వున్నారు. ఇక రమేష్ వర్మ కూడా రెండు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసి ఉన్నారు. రమేష్ వర్మ-రాఘవ లారెన్స్ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు తదుపరి అప్ డేట్ లో..