బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో ఓ గెస్ట్ రోల్ చెయ్యడమే కాదు.. చిరూతో కలిసి అద్దిరిపోయే డాన్స్ చేసి సౌత్ అందులోను తెలుగు రాష్ట్రాల ప్రజలని ఊపేసారు సల్మాన్ ఖాన్. ఈ విషయం మెగాస్టార్ స్వయంగా చెప్పారు కూడా. మరి అంత పెద్ద హిందీ స్టార్ చిరు కోసం సింగిల్ పైసా ఆశించకుండా పాత్ర వెయ్యడం మాములు విషయం కాదు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసి కా జాన్ లో సింగిల్ పైసా ఆశించకుండా లుంగీ డాన్స్ ఇరగదీసేసాడు.
వెంకీ-సల్మాన్ ఖాన్ కలయికలో తెరకెక్కుతున్న కిసి కా భాయ్ కిసి కా జాన్ చిత్రంలోని ఏంటమ్మా సాంగ్ లో లుంగీతో రామ్ చరణ్ డాన్స్ అదరగొట్టేసాడు. మెరిసిపోయేలా పసుపు చొక్కా, తెలుపు లుంగీలో రామ్ చరణ్ స్టైలిష్ ఎంట్రీ, ఆయన రియల్ లైఫ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ వెంకీలతో వేసిన డాన్స్ వావ్ అనిపిస్తోంది. మన RRR స్టార్ తనదైన స్టైల్, గ్రేస్‌కి కలిసి వేసిన స్టెప్పులతో పాట మరింత అందంగా, ఆకర్షణీయంగా అనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.
ఏంటమ్మా పాటలో ముగ్గురు హీరోలు పక్కపక్కన షేక్ చేసే స్టెప్పులేస్తుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవట్లేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఈ ముగ్గరి సాంగ్.. మధ్యలో బుట్టబొమ్మ పూజ హెగ్డే లంగా వోణిలో బ్యూటిఫుల్ స్టెప్స్ వేస్తూ మధ్యలో లుంగీ కడితే.. ఆ మజానే వేరు.. అన్నట్టుగా ఉంది.
మరి రామ్ చరణ్-సల్మాన్-వెంకీ కలిసి వేసిన డాన్స్ నార్త్ ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అయ్యిందో కానీ.. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాత్రం ఊగిపోతున్నారు. మెగా ఫాన్స్ అయితే విజిల్స్ వేస్తూ హంగామా చేస్తున్నారు.