Advertisement
Google Ads BL

పుష్ప అప్ డేట్స్ పై ఆత్రంగా ఉన్న అల్లు ఫాన్స్


Updates rolling soon! #PushpaTheRule ❤️‍🔥🤙 అంటూ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అప్పుడే ఏప్రిల్ 4 వచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్ డే కి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. ఈలోపు ఏప్రిల్ 8 న ఇవ్వబోయే స్పెషల్ ట్రీట్ పై అప్ డేట్ వస్తుంది అల్లు ఫాన్స్ ఆత్రం చూపిస్తున్నారు. పుష్ప నుండి స్పెషల్ గ్లిమ్ప్స్ రాబోతుంది, అది కూడా అల్లు అర్జున్ సోలో యాక్షన్ సీక్వెన్స్ తో ఆయన బర్త్ డే కి సుకుమార్ స్పెషల్ గా గ్లిమ్ప్స్ రెడీ చేస్తున్నారంటూ ఏవేవో ఊహాగానాలు వినిపించడమే కానీ.. అది ఏమిటో పక్కాగా సమాచారం ఇస్తే బావుంటుంది అనేది అభిమానుల ఆలోచన.

Advertisement
CJ Advs

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా పుష్ప ద రూల్ నుండి ఎలాంటి సర్ ప్రైజ్ వస్తుందో అంటూ ఫాన్స్ అప్పుడే అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో రికార్డ్ వీడియోస్, లైక్స్ తో హల్చల్ చెయ్యాలని చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే పుష్ప 2 కొత్త షెడ్యూల్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు . నిన్న అల్లు అర్జున్ తన కొడుకు బర్త్ డే స్పెషల్ గా సూపర్ స్పెషల్ పిక్ తో ఆయన్ ని విష్ చేసాడు. 

ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియాలో అల్లు అర్జున్ గ్రాఫ్ అమాంతం పెరగడంతో ఇప్పుడు ఆయన నుండి వస్తున్న పుష్ప ద రూల్ పై అంచనాలు భారీగా మొదలయ్యాయి. సోలోగా పుష్ప ప్రమోషన్స్ చేసి సినిమాని నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేసిన అల్లు అర్జున్ అంటే హిందీ ప్రేక్షకుల్లోనూ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడిందట. అందుకే పుష్ప2 పై అంచనాలు అలా ఉన్నాయి. ఆ అంచనాలు అందుకోవడానికి ఏడాది గ్రౌండ్ వర్క్ చేసి మరీ సెట్స్ లోకి వెళ్లారు బన్నీ అండ్ సుక్కూలు.

Allu fans are eager for Pushpa updates:

Updates rolling soon! Pushpa The Rule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs