Advertisement
Google Ads BL

బాయ్ ఫ్రెండ్ తో కలిసి శ్రీవారి దర్శనానికి జాన్వీ


శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి తిరుమల శ్రీవారు అంటే ఎంత భక్తో అందరికి తెలుసు. ఎప్పటికప్పుడు జాన్వీ కపూర్ తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటుంది. వీలయితే తన పెళ్లి కూడా తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధిలో జరిగితే తనకిష్టమని చెబుతూ ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ మరోసారి వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చింది. అది కూడా పట్టు పరికిణి, ఓణిలో అచ్చమైన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా జాన్వీ కనిపించింది.

Advertisement
CJ Advs

ఆమె ఆలయం వెలుపల సాష్టాంగ నమస్కారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడూ గ్లామర్ డ్రెస్సులతో మెస్మరైజ్ చేసే జాన్వీ కపూర్ ఇలా శ్రీవారి సన్నిధిలో లంగాఓణిలో అద్భుతంగా కనిపించింది. అయితే జాన్వీ కపూర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనవడితో కలిసి తిరుపతికి రావడం చర్చనీయాంశం అయ్యింది. కొద్దిరోజులుగా జాన్వీ కపూర్ ఎక్కడ చూసినా మహారాష్ట్ర సీఎం షిండే మనవడు శిఖర్ తో కనిపించడం.. ఇప్పుడిలా దర్శనానికి కలిసి రావడమే హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేసేందుకు ఎగ్జైట్ అవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్.. కొరటాల శివ సినిమా సెట్స్ లోకి వెళ్లిపోగా జాన్వీ కపూర్ త్వరలోనే NTR30 టీమ్ తో జాయిన్ కానుంది.

Janhvi Kapoor visits Tirumala :

Janhvi Kapoor visits Tirumala to seek blessings of Lord Venkateswara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs