Advertisement
Google Ads BL

ఒకే ఒక్క పిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు


కోలీవుడ్ యాక్టర్ విజయ్ అంటే విపరీతమైన అభిమానం చూపిస్తారు ఫాన్స్. ఆయన ఫేస్ బుక్, ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉన్నప్పటికీ ఇప్పటివరకు విజయ్ ఇన్స్టాగ్రామ్ లో లేరు. సౌత్ హీరోలు, హీరోయిన్స్, బాలీవుడ్ సెలెబ్రిటీస్ అంతా సోషల్ మీడియాలో హడావిడి చెయ్యడమే కాదు.. ఇన్స్టా లో రికార్డ్ ఫాలోవర్స్ తో కొత్త కొత్త రికార్దులని క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా అందరూ ఇన్స్టాలో హల్ చల్ చేస్తున్నా.. కోలీవుడ్ హీరోలైన అజిత్, విజయ్ లు ఇన్స్టా ని పట్టించుకోలేదు. అజిత్ అయితే ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోనూ లేరు.

Advertisement
CJ Advs

కానీ నిన్న ఆదివారం విజయ్ ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. తను ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసిన ఒక గంటలోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేశారు. Hello Nanbas and Nanbis 😊 అంటూ ఒకే ఒక్క పిక్ పోస్ట్ చేసారు. మొత్తం మీద 4 గంటల్లోనే 2 మిలియన్ మార్క్ దాటేశారు. ఇప్పుడు ఒక రోజు పూర్తి కాకముందే.. విజయ్ ఇన్స్టాలో 4.3M ఫాలోయర్స్ వచ్చేసారు. మరి విజయ్ క్రేజ్ కి ఈ  ఉదాహరణ చాలేమో అంటూ ఆయన ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.

గంటల్లోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన వారిలో విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఆయనకన్నా ముందు సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ BTS.. 43 మినిట్స్ లోనే 1 M మార్క్‌ చేరకుని ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ కేవలం 59 నిమిషాల్లో ఈ రికార్డ్ చేరుకుంది. ఇప్పుడు 99 నిమిషాల్లో విజయ్ ఈ మార్క్‌ను చేరుకున్న మూడో సెలబ్రిటీగా రికార్డ్ క్రియేట్ చేసారు. 

Vijay Made A Grand Instagram Entry:

Vijay First Instagram Post Draws Huge Attention
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs