Advertisement
Google Ads BL

ఆంటీ అంటే కోపం రావడం లేదు: అనసూయ


సోషల్ మీడియాలో ఏ యాంకర్ కి, ఏ నటికి రానంత ట్రోల్స్ అనసూయ భరద్వాజపై వస్తుంటాయి. అనసూయ ఏం మాట్లాడినా దానికి పెడర్ధాలు తీస్తూ నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తారు. ఒక్కోసారి అనసూయ కూడా కావాలని కెలుక్కుంటుంది. అయితే తనని విమర్శించే వారిపై సివంగిలా విరుచుకుపడుతుంది. తనని ఆంటీ అన్న వారిని నిద్రపోకుండా వెంటాడుతుంది. ఆంటీ అంటే ఇంతెత్తున లేస్తుంది. అలాంటి అనసూయకి ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదట.

Advertisement
CJ Advs

ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిమ్స్ షూటింగ్స్ లో పడి జబర్దస్త్ ని పక్కనపెట్టేసిన అనసూయ.. తాజాగా అభిమానులతో ఆదివారం చిట్ చాట్ చేసింది. ఆ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి నవ్వుతూ సంధానమిచ్చిన అనసూయని ఓ అభిమాని.. అక్కా మిమ్మల్ని ఆంటీ అంటే ఎందుకంత కోపమొస్తుంది అని ప్రశ్నించాడు. దానికి అనసూయ ఆంటీ అనే వాళ్ళకి అర్ధాలు వేరే ఉంటాయి. అయినా నాకు ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాను.

అలాంటి వాళ్ళని కరెక్ట్ చేస్తూ కూర్చోలేను, నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి.. అంటూ చెప్పిన అనసూయ తన కొత్త ప్రాజెక్ట్ ని త్వరలోనే ఎనౌన్స్ చెయ్యబోతున్నట్టుగా అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది.

Anasuya : I Get Angry When Someone Calls Me:

Anasuya Bharadwaj chit chat with fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs