Advertisement
Google Ads BL

రావణాసుర ప్రమోషన్స్ లో కనిపించని అను


హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ కి గ్లామర్ ఉన్నా లక్ కలిసి రావడం లేదు, అందాలు ఆరబోస్తూ గ్లామర్ పాత్రలు చేసినా ఆమెకి ఛాన్స్ లు రావడం లేదు. మెగా హీరో అల్లు శిరీష్ తో నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా హిట్ అయ్యింది, అయినా అను పేరు మోగిపోయింది లేదు. అలాగే టాప్ హీరోయిన్ లా అను ఇమ్మాన్యువల్ సినిమా ప్రమోషన్స్ ని పట్టించుకోదు అనే ప్రచారం ఉంది. మహా సముద్రం అప్పుడు, ఉరవశివో రాక్షసివో అప్పుడు కూడా అను ఇమ్మాన్యువల్ అంతగా ప్రమోషన్స్ లో కనిపించలేదు. యూనిట్ తో కలిసి ఏదో ఉర్వశివో రాక్షసివో ఈవెంట్ అప్పుడు కనిపించినా, సోలో ఇంటర్వూస్ లేవు. 

Advertisement
CJ Advs

అసలే ఆఫర్స్ లేవు. ఇలాంటి సమయంలో అను ఇమ్మాన్యువల్ ఎలా ఉండాలి. అవసరానికి, అనసరమైన దానికి సోషల్ మీడియాలో హడావిడి చెయ్యాలి. కానీ పాప మాత్రం ఆలా చెయ్యదు. అంతెందుకు రావణాసురలో రవితేజకి జోడిగా నటించింది. అందులో ముగ్గురు హీరోయిన్ ఉన్నారు. మేఘ ఆకాష్, ఫారియా అబ్దుల్లా, దక్ష నగార్కర్.. అను ఇమ్మన్యువల్. మరి ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండదు అనుకుందో.. లేదంటే మారేదన్నానో కానీ.. అను మాత్రం రావణాసుర ప్రమోషన్స్ లో కనిపిస్తే ఒట్టు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రాలేదు. 

సినిమాలో ఆఫర్స్ ఇస్తారు, ప్రమోషన్స్ లో పాల్గొంటే ఆమెకి మైలేజ్ వచ్చి ఇతర అవకాశాలు వస్తాయి. కానీ టాప్ హీరోయిన్ లా బిల్డప్ ఇస్తే కష్టం. రావణాసుర ప్రమోషన్స్ లో ఎక్కడైనా అను ఇమ్మాన్యువల్ కనబడుతుందా అని చాలామంది వెతుకుతున్నారు. అను మాత్రం దొరకడం లేదు.

Anu who is not seen in Ravanasura promotions:

Anu Emmanuel skips Ravanasura Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs