రామ్ చరణ్ పదేళ్ల క్రితం కామినేని వారి అమ్మాయి ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకి మద్దతు పలికి అంగరంగ వైభవంగా కామినేని-మెగా ఫ్యామిలీలు పెళ్లి చేసాయి. అప్పట్లో ఉపాసన చాలా లావుగా ఉంది.. రామ్ చరణ్ ఆమెని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు, లేదంటే ఇలాంటి అమ్మాయిని హీరో అయ్యుండి పెళ్లి చేసుకుంటాడా అనే ట్రోలింగ్స్ నడిచాయి. తర్వాత కొన్నాళ్ళకి ఉపాసన విపరీతంగా డైట్ చెయ్యడం, యోగ, వర్కౌట్స్ తో బరువు తగ్గి నాజూగ్గా, గ్లామర్ గా తయారైంది.
ఇప్పుడు పదేళ్ల తర్వాత చరణ్-ఉపాసన దంపతులు తల్లితండ్రులవుతున్న ఆనంద క్షణాలని అడుగడుగునా ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఈ జంట ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఉపాసన ముంబై చెందిన ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంది. చరణ్ నేనూ కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయమై తర్వాత ప్రేమలోపడ్డామని, చరణ్ ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ చేస్తూ ఉండేవాడు, నేను కూడా సవాళ్ళని విసురుతూ ఉండేదాన్ని.. అలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాము, భిన్నమైన కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన మేమిద్దరం నమ్మకం, ప్రశంసలు, కొన్ని సమయాల్లో కాంప్రమైజ్ అవుతూ తమ రిలేషన్ ని మరింత బలంగా మార్చుకున్నామని చెప్పిన ఉపాసన.. పెళ్లి తర్వాత చరణ్ పై వచ్చిన ఆరోపణలు కూడా వివరించింది.
చరణ్ తో పెళ్లి జరిగిన కొత్తలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నాను. నేను అందంగా లేనని, అబ్బాయిలా ఉన్నానని, లావుగా ఉన్నానని, కేవలం డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నారని కొందరు మాట్లాడారు అని ఉపాసన చెప్పింది. అయితే తనపై విమర్శలు చేసిన వారిని తాను నిందించాలని అనుకోవడం లేదని, కానీ వాళ్లకు నా గురించి, నా లైఫ్ స్టయిల్ గురించి గురించి ఏమీ తెలియదని, అందుకే అలా మాట్లాడి ఉండొచ్చు, అయితే ఈ పదేళ్లలో తన గురించి వారికి తెలిసిందని, ఇప్పుడు తనపై వారి అభిప్రాయం మారిపోయిందంటూ ఉపాసన ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.