కన్నడ భాషలో 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి పాన్ ఇండియాలోని పలు భాషల్లో కూడా రిలీజ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకి పైగా కొల్లగొట్టిన కాంతార డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి విజయ యాత్ర ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ లో పాపులర్ షో కరణ్ విత్ కాఫీ షోకి రిషబ్ శెట్టి కి ఆయన భార్యతో సహా ఆహ్వానం అందింది అనే న్యూస్ వైరల్ అవుతుండగా.. రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ పనులు మొదలు పెట్టేసారు.
ఇప్పుడు కాంతార హీరో రిషబ్ శెట్టి పొలిటికల్ ఎంట్రీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. కోలీవుడ్ రిపోర్టర్ ఒకరు రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఓ ట్వీట్ వెయ్యడం అది వెంటనే వైరల్ అవడంతో.. ఈ న్యూస్ పై రిషబ్ శెట్టి కూడా స్పందించారు. తనకి ప్రస్తుతం రాజకీయాలంటే ఇంట్రస్ట్ లేకపోగా.. అసలు పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది అని చెప్పారు.
తనని తన సినిమాలని, అభిమానులు అలాగే ప్రజలు ఆదరించాలని, గతంలో కూడా నేను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.. కానీ తనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ లేనట్లుగా రిషబ్ తెగ్గొట్టేసారు.