లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకుని క్యూట్ జంటగా అందరికి నచ్చిన సమంత-నాగ చైతన్యలు విడిపోయి విడాకులు తీసుకోవడం వాళ్ళ అభిమానులకే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి నచ్చలేదు. ఇప్పటికీ కొంతమంది సమంతది తప్పంటే ఊరుకోరు, అలాగే నాగ చైతన్యని బ్లేమ్ చేస్తే ఒప్పుకోరు. అలాంటి జంట విడిపోవడం ఇప్పటికీ హాట్ టాపిక్కే. నాగ చైతన్య మాత్రం ఈ విడాకుల విషయంలో హుందాగా ప్రవర్తిస్తుంటే..సమంత మాత్రం పదే పదే ఈ విషయమై చర్చలు లేవనెత్తుతుంది.
సింపతీ కోసం పాకులాటో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతం శాకుంతలం ప్రమోషన్స్ లో మరోసారి నాగ చైతన్యతో విడాకుల విషయం మాట్లాడింది. చైతూతో విడాకులు అయిన తర్వాత నా లైఫ్ లో అవి చీకటి రోజులు. పిచ్చిపిచ్చిగా ఆలోచించే దానిని. కానీ ఆ ఆలోచనలు నన్ను నాశనం చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాను, నా మనసుకు నచ్చినట్టుగా చేశాను. నా మనసు చెప్పిందే నమ్మాను.
లక్కీగా నా ఫ్యామిలీ మెంబెర్స్, ఫ్రెండ్స్ కొంతమంది నాకు సపోర్ట్ చేసారు. కానీ ఇప్పటికీ ఆ విషయంలో మధనపడుతూనే ఉంటాను. ఇంకా కోలుకోలేకపోతున్నాను, కానీ ఆ చీకటి రోజుల నుండి ఎంతో కొంత అయితే బయటపడ్డాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని దాటేందుకు ప్రయత్నం చెయ్యాలి కానీ.. అందులో చిక్కుకుపోకూడదు అంటూ సమంత మళ్ళీ విడాకుల విషయాన్ని హైలెట్ చేసింది.