Advertisement
Google Ads BL

అలియాతో రష్మిక నాటు నాటు..


నాటు నాటు సాంగ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మార్మోగిపోతోంది. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడంతో ఇప్పుడు ఈ పాట ని ఇండియన్ సెలబ్రిటీస్ తో పాటుగా ఆడియన్స్ కూడా హమ్ చేస్తూ అదరగొట్టేస్తున్నారు. ఏ వేదిక మీద చూసినా ఈ సాంగ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి. తాజాగా ముంబై లో నీతా ముఖేష్ అంబానీ కల్చరర్ సెంటర్ ఓపెనింగ్ డే 2 లోను ఈ నాటు నాటు స్టెప్స్ తో ఇద్దరు టాప్ హీరోయిన్స్ స్టేజ్ మీద ఇరగదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Advertisement
CJ Advs

ముంబైలో తళుక్కుమనే తారల మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతున్న నీతా ముఖేష్ అంబానీ కల్చరర్ సెంటర్ ఓపెనింగ్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా.. హాలీవుడ్ తారలు పాల్గొంటున్నారు. రెండు రోజులుగా ఈ సెలబ్రిటీస్ అంతా రంగురంగుల దుస్తుల్లో సీతాకోకచిలుకల్లా రెడీ అయ్యి మెరుపులు మెరిపిస్తున్నారు. అలియా భట్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, ఐశ్వర్య రాయ్, షారుఖ్, దీపికా, ప్రియాంక చోప్రా అయితే తమ తమ భర్తలతో హాజరై హడావిడి చేసారు.

ఇక గత రాత్రి జరిగిన ఈ ఈవెంట్ లో సౌత్ హీరోయిన్ రష్మిక, ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్ అలియా భట్ కలిసి నాటు నాటు సాంగ్ కి స్టేజ్ పై స్టెప్స్ వేసిన వీడియో వైరల్ అయ్యింది. డాన్సర్స్ తో కలిసి రష్మిక-అలియా భట్ లు నాటు నాటు సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేశారు. అంతేకాకుండా షారుఖ్, రన్వీర్ సింగ్, వరుణ్ ధావన్ లు కూడా కొన్ని సాంగ్స్ కి స్టేజ్ పై డాన్స్ చేసారు. రన్వీర్ సింగ్-ప్రియాంక కలిసి డాన్స్ లో దుమ్మురేపారు. 

Rashmika, Alia set the stage on fire as they dance to Naatu Naatu:

Alia Bhatt and Rashmika Mandanna perform together to Naatu Naatu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs