Advertisement
Google Ads BL

దసరా సినిమాపై ఇంత నెగిటివిటినా?


ఈ గురువారం శ్రీరామనవమి ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయిన నాని దసరా వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రా అండ్ రస్టిక్ అంటూ దసరా చూసిన వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాని ధరణి కేరెక్టర్ ఆయన కెరీర్ లోనే బెస్ట్ అంటూ కితాబునిస్తున్నారు. కీర్తి సురేష్ వెన్నెల పాత్ర, నాని ఫ్రెండ్ సూరి పాత్ర సినిమాకి ప్రాణం పోసాయంటున్నారు. దసరా ఓవర్సీస్ టాక్, అలాగే ప్రీమియర్స్ షో టాక్, ఫాన్స్ టాక్ మాత్రమే కాదు.. దసరా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతం అని చెబుతున్నారు. మ్యూజిక్, నాని పెరఫార్మెన్స్, BGM, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అన్ని సూపర్బ్ అంటున్నారు. సెకండ్ హాఫ్ లాగ్, కథం, కథనాలు వీక్ అయినా.. దసరా బావుంది, నచ్చుతుంది అంటూ బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రేక్షకులు చెబుతున్నమాట.

Advertisement
CJ Advs

కానీ మరోపక్క దసరాపై కావాల్సినంత నెగిటివిటి మొదలైంది. దసరా సినిమా హిట్ అంటున్నారు కానీ.. అదసలు హిట్ కాదు. మార్నింగ్ ఉన్న ఊపు సాయంత్రానికి లేదు అంటూ దసరా సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ వైజ్ గా, పబ్లిసిటీ వైజ్ గా నాని తన శాయశక్తులా సినిమాపై క్రేజ్, హైప్ క్రియేట్ చేసాడు. కానీ కొంతమంది మాత్రం పనిగట్టుకుని దసరాపై నెగెటివ్ గా స్ప్రెడ్ చెయ్యడం నానికి తలనొప్పిగా మారింది. 

దసరా సినిమాలో.. స్క్రీన్ ప్లే స్లో, విలన్ కేరెక్టర్ వీక్, స్టార్ క్యాస్ట్ వీక్, సెకండ్ హాఫ్ లాగ్, పెట్టిన బడ్జెట్ కి వస్తున్న కలెక్షన్స్ ఏ మాత్రం సరిపోవు, అసలు శ్రీకాంత్ ఓదెల గ్రౌండ్ వర్క్ చెయ్యలేదా.. కీర్తి సురేష్ కి దసరాలో ప్రాధాన్యత లేని రోల్ ఇచ్చారు, సముద్ర ఖనిని సరిగ్గా వాడుకోలేదు, ఓపెనింగ్స్, కలెక్షన్స్ పై నెటిజెన్స్ ఫైర్, నిర్మాతలు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు, ఆర్.ఆర్.ఆర్, కాంతారా, పుష్ప లతో పోల్చుకున్నాడు నాని, కానీ అంత లేదంటున్న ఆడియన్స్, ఫస్ట్ షోకి పోజిటివ్ టాక్ వచ్చినా సాయంత్రానికి పరిస్థితి ఎందుకు మారిపోయింది అంటూ నెగెటివ్ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తున్నారు.

అది కూడా ప్రముఖ వెబ్ సైట్స్, ప్రముఖ ఛానల్స్ లోనే నాని దసరాపై ఈరకమైన న్యూస్ లు రావడం వలన దసరాపై ఎంతో కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలని ట్రేడ్ నిపుణులు వ్యక్తపరుస్తున్నారు.

Why is there so much negativity on Dasara movie?:

Dasara movie showing wrong calculations?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs