Advertisement
Google Ads BL

తంబీలు హర్ట్.. రష్మిక గిఫ్ట్!


ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. పలు సాంగ్స్‌కి డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ స్టేడియంలో ఉన్న అందరినీ ఆకర్షించింది. ఆమె కంటే ముందు తమన్నా తన మెరుపులు మెరిపించినా.. అంత పెద్దగా ఫోకస్ కాలేదు. కానీ రష్మిక మాత్రం స్టేడియాన్ని ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా ఆమె ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా చేసే పాటకే.. ఈ స్టేజ్‌పై కూడా డ్యాన్స్ చేసింది. పుష్ప సినిమాలోని ‘నా సామి.. రారా సామి’ పాటతో ఆమె తన పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. ఈ మధ్య రష్మిక ప్రతి ఈవెంట్‌లో ఈ పాటకి స్టెప్స్ వేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

ఈ పాటని ఆమె వాడుతున్న విధానంపై.. ఇటీవల నితిన్‌ కూడా పంచులు పేల్చాడు. ‘భీష్మ’ కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని అనౌన్స్‌ చేయడానికి ఓ స్పెషల్ వీడియోని మేకర్స్ విడుదల చేయగా.. అందులో రష్మికను సరదాగా ఈ పాట విషయంలో ఆటపట్టించాడు. సరే అసలు విషయంలోకి వస్తే.. ఐపీఎల్ వేదికపై ఈ పాటతో పాటు రష్మిక ‘పుష్ప’ చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాటకి, ‘గంగుబాయి కాఠియావాడి’ చిత్రంలోని డోలీనా పాటకి, ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాటకి డ్యాన్స్ చేసింది. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనితో కాసేపు సరదాగా సంభాషించింది. ఆ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, ధోనితో సంభాషణకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేదికపై రష్మిక తమిళ పాటకి డ్యాన్స్ చేయలేదంటూ.. చెన్నై సూపర్ కింగ్స్‌కి సపోర్ట్ చేస్తూ.. తమిళ పాటకి డ్యాన్స్ చేయవా? అని తమన్నాపై కొందరు తంబీలు ఫైర్ అవుతున్నారు. 

అలా ఫైర్ అయ్యే వారందరికీ తమన్నా సోషల్ మీడియా వేదికగా ఓ గిఫ్ట్ ఇచ్చింది. రీసెంట్‌గా తను తమిళ్‌లో నటించిన ‘వారిసు’ చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేసి.. ఆ వీడియోని సోషల్ మీడియాలోకి వదిలింది. ఈ పాటని స్టేజ్‌పై చేయాలని అనుకున్నాను కానీ.. కుదరలేదు. అందుకే ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.. అంటూ ఆమె షేర్ చేసిన డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. హర్ట్ అయిన తంబీలకు రష్మిక గిఫ్ట్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Rashmika Released Special Video for Kollywood Fans:

Rashmika Mandanna Dance Performance at IPL 2023 Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs