Advertisement
Google Ads BL

దసరాని పొగుడుతున్న బాలీవుడ్ క్రిటిక్స్


టాలీవుడ్ సినిమాలు హిట్ అవుతున్నాయంటే బాలీవుడ్ లో ఏదో తెలియని కడుపుమంట. ఆర్.ఆర్.ఆర్ కి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు వచ్చినా స్పందించలేని కళ్ళు కుతంత్రాలు బాలీవుడ్ ప్రముఖుల్లో కనిపించాయి. మరి మన తెలుగు సినిమాలేమో వరసబెట్టి పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ హిందీలో విడుదలై ఇరక్కుమ్మేస్తున్నాయి. అది చూసిన అక్కడి వారు ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారు. ఎందుకంటే తెలుగు సినిమాల ముందు హిందీ సినిమాలు చిన్నబోతున్నాయి. అందుకే వాళ్ళకి టాలీవుడ్ పై మంట.

Advertisement
CJ Advs

బాలీవుడ్ క్రిటిక్స్ తమ హిందీ సినిమాలు హిట్ అయితే.. వాటిని సోషల్ మీడియాలో తమ శాయశక్తులా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ క్రిటిక్స్ తెలుగు సినిమాలని కూడా పొగడడం మొదలు పెట్టారు. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన దసరాకి బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ పొగుడుతూ తన రేటింగ్ 3.5/5 అంటూ సినిమా చూసాక సింగిల్ వర్డ్ రివ్యూ అంటూ Dasara: POWERFUL పంచ్ లైన్ ఇవ్వడం వైరల్ గా మారింది. 

దసరా అద్భుతమైన కమర్షియల్ సినిమా. అదరగొట్టేసే మ్యూజిక్, స్క్రీన్ ప్లే.. తెరపై కదిలే పాత్రలు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన కథతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక నాని అయితే సినిమాని భుజాలపై నడిపించాడు. నాని పాత్రకి హిందీలో శరద్‌ కేల్కర్ వాయిస్ అద్భుతంగా సెట్ అయ్యింది. కీర్తి సురేష్ అద్భుతమైన అభినయంతో మెప్పించింది. దసరా సెకండ్ హాఫ్ లో కాస్త ట్రిమ్ చేసి ఉండవచ్చు. ఒకటి లేదా రెండు పాటలని కట్ చేస్తే సినిమాపై మరింత ఇంపాక్ట్ ఉండేది.. అంటూ తరుణ్ ఆదర్శ్ దసరాపై ఇచ్చిన రివ్యూకి బాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవడం ఖాయం. హిందీలో దసరా కలెక్షన్స్ పెరగడం కూడా పక్కానే.

Taran Adarsh review on Dasara movie:

Bollywood Top Critic Taran Adarsh review on Nani Dasara movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs