ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత లైఫ్ లో ప్రేమ, పెళ్లి, విడాకులు పెద్ద సంచలనమే. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ వివాహ బంధాన్ని నిలబెట్టుకోలేక సమంత విడాకులు తీసుకుని చైతూకి దూరంగా ఒంటరిగానే ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది అత్యంత సహజమే. దానిని నిలబెట్టుకోలేకపోతే విడాకులకు దారి తీసే ఘటనలు కామనే. కానీ సమంత తన పని తాను చేసుకుంటూనే ఇప్పుడు సింపతీ కోసం పాకులాడుతుందా అనేలా ఆమె ప్రవర్తన కనిపిస్తుంది.
ఎందుకంటే సమంత అనారోగ్యానికి గురైంది. అది చాలామందికి జరిగేదే. అలాగే భర్తతో విడిపోయి విడాకులు తీసుకుంది. అది అందరి లైఫ్ లో జరక్కపోయినా.. వివాహ బంధంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడం కుదరకపోతే అది జరుగుతుంది. అలాంటి సమంత తన జీవితంలోనే ఇవన్నీ జరిగినట్టుగా చెబుతుంది. మొన్నటికి మొన్న యశోద విడుదల సమయంలో తాను మాయోసైటిస్ తో బాధపడుతున్నాను, చాలా నీరసంగా ఉంటున్నాను.. అంటూ తన మీద సింపతీ వచ్చేలా ఇంటర్వ్యూ ఇచ్చింది. యశోద ప్రమోషన్స్ కి అది బాగా వర్కౌట్ అయ్యింది.
ఇప్పుడు మరోసారి శాకుంతలం ప్రమోషన్స్ లోను అదే పాట పాడి ట్రోల్ కి గురవుతుంది. తన వైవాహిక జీవితంలో నిజాయితీగా ఉన్నాను అంటూ ఎప్పుడో ఏడాదిన్నర క్రితమే జరిగిపోయిన విడాకుల సంగతి ఇప్పుడు కొత్తగా ఎత్తుకుంటుంది, అంతేకాకుండా ఏడాదిన్నర క్రితమే అందాలు ఆరబోస్తూ విమర్శలపాలైన పుష్ప ఐటెం సాంగ్ విషయమూ ప్రస్తావిస్తుంది. ఆ సాంగ్ చెయ్యొద్దన్నారు, ఫ్యామిలీ మెంబెర్స్ కుదరదు ఇంట్లోనే కూర్చోమన్నారు, ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చెయ్యలేదు అంటూ చెప్పడం చూస్తే సమంత కావాలనే సానుభూతి కోసం పదే పదే ప్రవర్తిస్తుంది అనిపించేలా ఆమె మాటలు ఉన్నాయి.
అటు నెటిజెన్స్ కూడా సమంత సానుభూతి మంత్రంపై సెటైర్లు వేసుకుంటున్నారు. ఇది సమంత ఒక్కదానికే జరిగిందా, తానొక్కటే కష్టపడుతుందా.. కష్టపడేది డబ్బు కోసమే. ఎవరి కోసమో ఆమె కష్టాన్ని త్యాగం చెయ్యడం లేదు కదా, దీనికోసం ఆమె ఇంతగా తపన పడాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.