Advertisement
Google Ads BL

బాలయ్య vs బోయపాటి


బాలయ్య-బోయపాటి కాంబో అంటే అదొక సెన్సేషన్. వీరిద్దరూ కలిసి సినిమా అనౌన్స్ చేస్తేనే సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. హ్యాట్రిక్ హిట్స్ తో బాలకృష్ణ-బోయపాటి కాంబో ఉంది. మరోసారి వీరి కలయికలో సినిమా అంటే..ఈసారి హైప్, అంచనాలు మాములుగా ఉండవు. సింహ, లెజెండ్.. నిన్నగాక మొన్న అఖండ.. ఈ మూడు కూడా బిగ్గెస్ట్ హిట్స్. అలాంటి కాంబో మొదటిసారి బాక్సాఫీసు ఫైట్ కి రెడీ అయ్యింది. అది కూడా ఇద్దరూ వేరు వేరు ప్రాజెక్ట్స్ తో కావడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచేసింది.

Advertisement
CJ Advs

బోయపాటి-రామ్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న #BoyapatiRapo చిత్రాన్ని దసరా స్పెషల్ గా అక్టోబర్ 20న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అందరికన్నా ముందు దసరా హాలిడేస్ పై రామ్-బోయపాటి కన్నేశారు. తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావు వచ్చి చేరింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి నుండి వస్తున్న రామ్ ప్రాజెక్ట్ పై బోలెడన్ని అంచనాలున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబో #NBK108 కూడా దసరా బరిలో నిలబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేసారు.

ఖచ్చితమైన తేదీ ఇవ్వకుండా విజయదశమికి #NBK108 రిలీజ్ ఉంటుంది.. ఆయుధపూజకి సిద్ధం అంటూ అనౌన్స్ చెయ్యడం.. హిట్ కాంబో.. వేర్వేరు సినిమాలతో బాక్సాఫీసు ఫైట్ కి దిగడం ఇప్పుడు నందనమూరి-బోయపాటి అభిమానుల్లో కలవరం రేపుతోంది. ఇద్దరూ కలిసి బాక్సాఫీసుని షేక్ చేసేవారు. ఇప్పుడు అదే ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడడం నిజంగా ఇంట్రెస్టింగ్ గా మారింది.

Balayya vs Boyapati:

NBK108 vs BoyapatiRapo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs