Advertisement
Google Ads BL

రవితేజ కొడుకు హీరోగా ఎంట్రీపై క్లారిటీ


మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర వచ్చే శుక్రవారం ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమైంది. ధమాకా, వాల్తేర్ వీరయ్య సక్సెస్ లతో జోరు మీదున్న రవితేజ రావణాసురుని భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర ఇంటర్వ్యూలో రవితేజకి ఆయన కొడుకు మహాధన్ హీరో ఎంట్రీపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలోనూ ఆయన సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో రవితేజని చాలామంది ఈ విషయమై అడిగారు. కానీ రవితేజ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement
CJ Advs

తాజాగా రావణాసుర ఇంటర్వ్యూలో హరీష్ శంకర్.. రవితేజని కొడుకు మహాధన్ సినిమాలోకి ఎప్పుడు రాబోతున్నాడనే ప్రశ్న అడిగాడు. దానికి రవితేజ నా కొడుకు మహాధన్ సినిమాల్లోకి రావొచ్చు రాకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉందా.. లేదా అని నేను చెప్పలేను. వాడికి పూర్తి క్లారిటీ ఉంది.. సినిమాల్లోకి రావాలో, వద్దో అనేది వాడిష్టం. డెఫనెట్ గా వస్తాడు, సినిమాలంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంది అంటూ రవితేజ కొడుకు ఎంట్రీ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. వాడేదో చేస్తున్నాడు, చెయ్యనివ్వండి, వాడు సినిమాల్లోకి వస్తాడు, అది ఎప్పుడు వస్తాడో చెప్పను అంటూ రవితేజ క్లియర్ కట్ గా చెప్పాడు.

సరే సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు మీకొడుకు మహాధన్ కి మీరిచ్చే సలహా ఏమిటి అని హరీష్ రవితేజని అడిగితే.. అస్సలివ్వను, నేనిచ్చే సలహాలు ఎప్పుడో అయ్యిపోయాయి, వాడు చాలా క్లియర్ గా ఉన్నాడు, నేను సలహాలు ఇవ్వకూడదు, వాడే అన్నీ తెలుసుకోవాలంటూ రవితేజ కొడుకు సినీరంగ ఎంట్రీపై ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసాడు. 

Ravi Teja Gives Clarity About His Son Entry In Cinema Industry:

Ravi Teja Superb Reply To Harish Shankar Question about his son entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs