బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా స్టేటస్ ని మెయింటింగ్ చేసి.. మధ్యలో క్యాన్సర్ కారణంగా కొన్నాళ్ళు మీడియాకి దూరంగా ఉంది. అయితే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తుంది. బొంబాయి చిత్రంతో సౌత్ పై తనదైన ముద్ర వేసిన మనీషా కొయిరాలాకు అప్పట్లో సూపర్ స్టార్ రజినికాంత్ బాబా పెద్ద షాకిచ్చింది అని చెప్పుకుంటారు. కాదు ఇప్పుడు మనీష కొయిరాలా కూడా అదే చెబుతుంది. మనీష కొయిరాలా బాబా సినిమా తర్వాత మళ్ళీ సౌత్ లో కనిపించలేదు.
ఆమె కూడా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అదే మాట్లాడింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన డిసాస్టర్ తర్వాత నా కెరీర్ సౌత్ లో ముగిసిపోతుంది అన్నారు.. అందరూ అనుకున్నట్టుగానే.. బాబా తర్వాత నేను సౌత్ లో కనిపించకుండా పోయాను. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాబా వైఫల్యం నా సౌత్ కెరీర్ ని నాశనం చేసింది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను, కానీ విడుదలయ్యాక ఫలితం వేరేలా ఉంది. బాబా కన్నా ముందు సౌత్ లో చాలామంచి సినిమాలు చేశాను. కానీ బాబా ప్లాప్ తో నాకు మరో సౌత్ సినిమా రాలేదు.
కానీ బాబా ని ఎలాంటి హడావిడి లేకుండా, ప్రమోషన్స్ లేకుండా రీ రిలీజ్ చెయ్యగా అది సూపర్ హిట్ అయ్యింది దానితో నేను షాకయ్యను. నిజంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో పని చెయ్యడం చాలా హ్యాపీగా అనిపించింది అంటూ మనిషా కొయిరాలా బాబా తర్వాత సౌత్ సినిమా అవకాశాలు రాక ఎలా కనుమరుగయ్యిందో చెప్పుకొచ్చింది.