Advertisement
Google Ads BL

జబర్దస్త్ ఇంద్రజని ఇన్సల్ట్ చేసిన కొత్త యాంకర్


జబర్దస్త్ జెడ్జ్ స్థానం నుండి రోజా ఎగ్జిట్ అవ్వగానే.. ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది. నాగబాబు, రోజా జెడ్జెస్ గా జబర్దస్త్ ని ఒక్క తాటిపై లాగేవారు. నాగబాబు వెళ్ళిపోయాక రోజా బాగానే హ్యాండిల్ చేసింది. కానీ రోజా కూడా వెళ్ళిపోయాక జబర్దస్త్ పై జనాలలో అటెన్షన్ తగ్గింది, అలాగే జబర్దస్త్ కమెడియన్స్ కూడా క్రమ శిక్షణ తప్పినట్లుగా కనిపించింది. అంటే టాప్ కమెడియన్స్ బ్రేకులు తీసుకుని మళ్ళీ రావడం, కొంతమంది అసలుకే వెళ్లిపోవడం. ఇక అనసూయ కూడా జబర్దస్త్ నుండి ఎగ్జిట్ అవడంతో ఆమె ప్లేస్ లోకి కొత్తగా సీరియల్ నటి సౌమ్య రావు వచ్చింది.

Advertisement
CJ Advs

మొదట్లో సౌమ్య రావు ని ట్రోల్ చేసినవారే ఇప్పుడు ఆమె యాంకరింగ్ కి అలవాటు పడుతున్నారు. గ్లామర్ గా అందాలు చూపిస్తుంది. తమిళ అమ్మాయైనా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. గబగబా మాట్లాడేస్తుంది అన్న ఒక్క కంప్లైంట్ తప్ప సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్ కి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక రష్మీ కి పోటీగా సౌమ్య రావు అందంగా రెడీ అవుతుంది. అయితే ఈరోజు శ్రీరామనవమి ఎపిసోడ్ లో జెడ్జ్ ఇంద్రజని సౌమ్య రావు అవమానించిన ప్రోమో వైరల్ గా మారింది. నవమి సందర్భంగా స్కిట్ లీడర్స్ పానకం తయారు చేసి దానికి జెడ్జ్ గా ఇంద్రజని టేస్ట్ చేసి ఎవరిది బాగుందో చెప్పమంటే.. ఇంద్రజ అందరిదీ టేస్ట్ చూసి రాఘవగారిది బావుంది అని చెప్పింది. వెంకీ మంకీ వాళ్ళది బాగుంది మళ్ళీ చూడండి అని ఇంద్రజాకి ఇచ్చింది సౌమ్య, అయినా రాఘవ గారిదే బావుంది అంది ఇంద్రజ. 

ఆ తర్వాత మీరు చూడండి కృష్ణభగవాన్ సర్ అంటూ ఆయనకి సౌమ్య పానకం ఇవ్వబోతుంటే.. అదేమిటి సౌమ్య ముందు నన్ను అడిగావు.. నేను చెప్పాను, మళ్ళీ అందరికి టేస్ట్ చూపించడం అనేది కరెక్ట్ కాదు అని మొహం మాడ్చుకుంది.. దానితో రాఘవ కూడా స్టేజ్ పై నుండి వెళ్ళిపోయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దానితో జెడ్జ్ ఇంద్రజని కొత్త యాంకర్ సౌమ్య ఘోరంగా అవమానించింది అంటూ జబర్దస్త్ ఈరోజు ఎపిసోడ్ పై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చేసాయి. మరి అది ఫ్రాంక్ ప్రోమోనా లేదా నిజంగానా అనేది ఈరోజు నైట్ ఎపిసోడ్ లో రివీల్ అవుతుంది.

Anchor Sowmya Humiliated Indraja:

Jabardasth: New Anchor Sowmya Rao Humiliated Indraja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs