Advertisement
Google Ads BL

ఫైనల్లీ పవన్ దర్శకుడికో సినిమా సెట్టయ్యింది


కొంతకాలంగా సినిమాలు హిట్ ఇచ్చిన దర్శకులు కూడా మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి ఏళ్ళకి ఏళ్ళు గ్యాప్ తీసుకుంటున్నారు. అవకాశాలు రాకో.. లేదంటే మారేదన్నా కారణమో కానీ.. చాలామంది దర్శకుల పరిస్థితి ఇలానే ఉంది. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, బోయపాటి ఇలాంటి కొంతమంది దర్శకులు మాత్రమే వెంటవెంటనే సినిమాలు చేస్తున్నారు కానీ.. మిగతా వాళ్ళ పరిస్థితి మరోలా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ తో హిట్ ఇచ్చిన వేణు శ్రీరామ్ ఇప్పటివరకు తదుపరి ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు.

Advertisement
CJ Advs

అల్లు అర్జున్ తో ఐకాన్ అన్నారు. అది ఎప్పుడు మొదలవుతుందో, అసలు మొదలవుతుందో, లేదో.. తెలియదు. ఇక భీమ్లా నాయక్ సాగర కే చంద్ర పరిస్థితి నిన్నటివరకు అలానే ఉంది. గత ఏడాది భీమ్లా నాయక్ విడుదలై హిట్ అయ్యింది. ఆతర్వాత సాగర్ పేరు వినిపించనే లేదు. ఒక ఏడాది గ్యాప్ తో సాగర్ కే చంద్ర కొత్త సినిమాని ప్రకటించాడు. అది కూడా బెల్లంకొండ హీరోతో. ఛత్రపతి రీమేక్ తో హిందీలోకి అడుగుపెడుతున్న బెల్లకొండ శ్రీనివాస్ నెక్స్ట్ చిత్రాన్ని సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చేస్తున్నట్టుగా శ్రీరామ నవమి ఫెస్టివల్ స్పెషల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్.

దానితో పవన్ దర్శకుడికో సినిమా దొరికిందిరా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ తో మేకింగ్ వైజ్ గా ఆకట్టుకున్న సాగర్ కె చంద్ర బెల్లంకొండని ఎలా చూపిస్తాడో చూడాలి. 14 రీల్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది.

Finally the film is set for Pawan director:

Sreenivas Bellamkonda, Saagar K Chandra, 14 Reels Plus BSS10 Announced
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs