Advertisement
Google Ads BL

సైంధవ్ డేట్ కూడా లాక్ చేసారు


ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ సీజన్ మొదలయ్యింది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K, మహేష్ బాబు #SSMB28, రామ్ #BoyapatiRapo, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ దేవరకొండ ఖుషి లాంటి చిత్రాల రిలీజ్ డేట్స్ లాక్ చేసి అనౌన్స్ చేసారు. ఇప్పుడు రీసెంట్ గా మొదలయిన విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం సైంధవ్ రిలీజ్ డేట్ లాక్ చేసారు. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ ప్రస్తుతం లెంతీ షెడ్యుల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూట్ లో వెంకటేష్, ఇతర తారాగణం పాల్గొంటున్నారు.

Advertisement
CJ Advs

ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పటికి, నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. సైంధవ్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. డిసెంబరు 25న (క్రిస్మస్) మొదటి సోమవారం సెలవుదినం కాబట్టి, సినిమా లాంగ్ వీకెండ్‌ని ఎంజాయ్ చేయనుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వెంకటేష్ చేతిలో మెషిన్ గన్ పట్టుకుని కంటైనర్ పైన కూర్చోవడం కనిపిస్తుంది. కంటైనర్‌లో కొన్ని పేలుడు పదార్థాలను గమనించవచ్చు. పోస్టర్‌లో వెంకటేష్ సీరియస్ గా కనిపిస్తున్నారు.

మేకర్స్ ఇదివరకే  విడుదల చేసిన టైటిల్ పోస్టర్ , గ్లింప్స్ లో వెంకటేష్ ఇంటెన్స్ అవతారంలో కనిపించారు. సైంధవ భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్‌ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ  మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Saindhav Releasing Worldwide On December 22nd:

Venkatesh, Sailesh Kolanu Saindhav Releasing Worldwide On December 22nd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs