Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్ తమిళ సినిమా అంట


ఆర్.ఆర్.ఆర్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ పటంలో వెలిగిపోతుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకే కాదు.. హాలీవుడ్ వరకు ఆర్.ఆర్.ఆర్ ని విస్తరించిన రాజమౌళి తెలుగు సినిమాకి ఆస్కార్ తెచ్చిన ఘనత మూటగట్టుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు రావడం ప్రతి ఒక్క తెలుగు వాడు గర్వించదగిన క్షణమే. ఇండియన్ సినిమాకే తలమానికంగా ఆర్.ఆర్.ఆర్ నిలిచిపోయింది. అలాంటి ఆర్.ఆర్.ఆర్ ని తమిళ సినిమా అంటూ అభివర్ణించిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నెటిజెన్స్ చేతిలో ట్రోల్ కి గురైంది. 

Advertisement
CJ Advs

ఈమధ్యన బాలీవుడ్ ఇండస్ట్రీపై, అక్కడ జరిగే పాలిటిక్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్న ప్రియాంక చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండగా.. సదరు యాంకర్ ఆస్కార్ విజేత ఆర్.ఆర్.ఆర్ గురించి అడగ్గానే.. ప్రియాంక చోప్రా ఆర్.ఆర్.ఆర్ ఒక గ్రేట్, బ్లాక్ బస్టర్ తమిళ మూవీ. ఇది మనందరికీ అవెంజర్స్ లాంటిది అంటూ గబా గబా మాట్లాడేసింది. మరి ప్రియాంకకి అంత తెలివి లేదా? ఆమె అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ రామ్ చరణ్, ఎన్టీఆర్, ఉపాసన, రాజమౌళికి ప్రీ ఆస్కార్ పార్టీ కూడా ఇచ్చింది.

అలాంటి ప్రియాంక ఆర్.ఆర్.ఆర్ ని తమిళ సినిమా అంటూ అభివర్ణించడం నెటిజెన్స్ కి బొత్తిగా నచ్చలేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందూ వెనుక చూసుకుని ఏం మాట్లాడుతున్నామో అనేది తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది అంటూ నెటిజెన్స్ ప్రియాంకకి చురకలు వేస్తున్నారు.

For Priyanka Chopra, RRR is a Tamil film:

Priyanka Chopra says RRR is not a Bollywood movie but a Tamil film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs