Advertisement
Google Ads BL

వైవాహిక జీవితంపై మొదటిసారి సమంత అలా


నాగ చైతన్యతో ప్రేమని పెళ్లి వరకు తీసుకొచ్చి, నాలుగేళ్ళ అందమైన వైవాహిక జీవితాన్ని విడాకుల పేరుతో తెంపేసుకుని ఒంటరిదైన సమంత ఆ బాధని ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కింది. చైతూతో విడాకుల విషయాన్ని మరిచిపోయి తర్వాత వర్క్ లో పడిపోయిన ఆమెని సోషల్ మీడియా విమర్శలు, మాయోసైటిస్ మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టాయి. అయితే అసలు నాగ చైతన్యతో సమంత ఎందుకు విడిపోయిందో అనేది ఎవ్వరికి అర్ధం కానీ ప్రశ్నగానే మిగిలిపోయింది.

Advertisement
CJ Advs

చైతూతో విడాకుల తర్వాత సమంత అల్లు అర్జున్ పుష్ప లో ఉ అంటావా మావ ఊఉ అంటావా మావా సాంగ్ లో గ్లామర్ గా అందాలు ఆరబోసేసింది. అప్పట్లో సమంత ఐటెం సాంగ్ పెద్ద సెన్సేషన్ అయ్యింది. అయితే తాజాగా సమంత ఆ సాంగ్ విషయం, అలాగే వైవాహిక జీవితం గురించి మొదటిసారి మాట్లాడింది. పుష్పలో ఐటమ్ సాంగ్ చెయ్యమని అది కూడా విడాకులు అయిన కొద్దికాలానికే అవకాశం వచ్చింది. అప్పట్లో నేను ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోవడంపై తీవ్ర విమర్శలొచ్చాయి.

నేను ఏ తప్పూ చెయ్యనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి. అందుకే ఆ స్పెషల్ సాంగ్ ఆఫర్ ని ఒప్పుకున్నాను, నేను ఎప్పుడైతే ఆ సాంగ్ చేస్తున్నానని అధికారికంగా ప్రకటించారో అప్పుడే హెడేక్ స్టార్ట్ అయ్యింది. విడాకులు తీసుకున్న వెంటనే ఇలాంటి సాంగ్ చెయ్యడం బాగోదు.. ప్రస్తుతం ఇంట్లోనే ఉండు అంటూ ఫ్యామిలీ మెంబెర్స్, సన్నిహితులు ఆఖరికి నన్ను సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్ కూడా వద్దని చెప్పారు. కానీ నాకు వాళ్ళ మాటలని పట్టించుకోవాలనిపించలేదు.

ఎందుకంటే నేనేమి తప్పు చెయ్యలేదు, నా వైవాహిక బంధంలో నేను కరెక్ట్ గా ఉన్నాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అలాంటాప్పుడు నేనెందుకు ఫీలవుతూ ఇంట్లోనే ఉండిపోవాలి. చేయని తప్పుకు నాకు నేను శిక్ష ఎందుకు వేసుకోవాలి. ఇప్పటికే ఎన్నో కష్టలు పడ్డాను, నటిగా ఇంకా బెటర్ గా ఉండాలి, అందంగా కనబడాలని చాలా కష్టపడ్డాను, మాయోసైటిస్, మెడికేషన్ వలన చాలా నీరసించిపోయాను, కళ్లద్దాలు కూడా స్టయిల్ కోసం పెట్టుకున్నానంటూ విమర్శించారు. కానీ నా కళ్ళు వెలుతురుని చూడలేవు.. అందుకే అద్దాలు పెట్టుకున్నాను, ఓ నటికి నాలాంటి కష్టాలు రాకూడదు అంటూ ఎమోషనల్ అయ్యింది సమంత.

Samantha Defies Family Advice And Accepts Pushpa Item song:

Samantha reacts her marriage life and Pushpa song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs