Advertisement
Google Ads BL

చరణ్ బర్త్ డే పార్టీ: జంటగా అడివి శేష్-సుప్రియ


యంగ్ హీరో, సక్సెస్ ఫుల్ హీరో అడివి శేష్.. కొన్నాళ్లుగా సుప్రియ యార్లగడ్డతో డేటింగ్ లో ఉన్నాడు. శేష్ త్వరలోనే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియని వివాహం చేసుకోబోతున్నాడనే న్యూస్ ఎప్పటినుండో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తే. గూఢచారి సినిమాలో అడివి శేష్-సుప్రియ కలిసి నటించారు.. అందుకే ఈ రూమర్ పుట్టింది అనుకోవడానికి లేకుండా.. అడివి శేష్ ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తిరగడం, క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ లో అక్కినేని హీరోలతో అలాగే సుప్రియతో కలిసి ఫోటో ఫ్రెమ్ లో కనిపించడం ఇవన్నీ.. వారి డేటింగ్ రూమర్స్ కి ఊతమిచ్చాయి.

Advertisement
CJ Advs

పెళ్ళై భర్తతో విడిపోయి.. సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలతో పాటుగా.. నిర్మాతగా మారింది. అయితే తాజాగా సుప్రియ-అడివి శేష్ కలిసి తిరుగుతున్నారనడానికి ఇప్పుడు మరో ఆధారం బయటపడింది. అది రీసెంట్ గా జరిగిన రామ్ చరణ్ బర్త్ డే పార్టికి అడివి శేష్, సుప్రియ ఒకే కారులో రావడం చూసిన వారు వీరి మధ్యన ఏదో ఉంది అంటూ ప్రచారం జరగడం కాదు.. నిజంగానే వీరి మధ్యన ఏదో ఉంది.. లేకపోతే ఇలా కలిసి వస్తారా అంటున్నారు.

అడివి శేష్-సుప్రియ.. మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే కి ఒకేసారి ఎంట్రీ ఇచ్చినా.. శేష్ మాత్రమే ఫొటోలకి ఫోజులివ్వగా.. సుప్రియ మాత్రం అక్కడ ఉన్నవారిని పలకరించుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఆమె వెనుక అడివి శేష్ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజెన్స్ ఏమిటి శేష్.. ఏమిటి సంగతి అంటూ నిలదీస్తున్నారు.

Ram Charan birthday party: Adivi Sesh-Supriya as a couple:

Adivi Sesh and his rumoured girlfriend Supriya Yarlagadda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs