Advertisement
Google Ads BL

ఆయనక్కర్లేదా మెగాస్టారూ..


మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారు. ఆయన నేను పెద్దని కాదు అంటున్నా.. ఆయన చేసే పనులతో ఆయన్ని పెద్దగా సినిమా ఇండస్ట్రీ అంతా భావిస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి అందరిని కలుపుకుపోతూనే కొన్ని విషయాల్లో కొంతమందికి విరోధులుగా మారుతున్నారు. ముఖ్యంగా చిరుతో బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి వాళ్ళు విభేదిస్తున్నారు. అయితే మెగాస్టార్ కూడా నందమూరి ఫ్యామిలీని అవాయిడ్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ ని ఆయన లైట్ తీసుకున్నారు అనేలా ఉంది వ్యవహారం. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే కి ఇండస్ట్రీలోని తన సమకాలీకులు నాగార్జున, వెంకటేష్ ఫామిలీస్ ని ఆహ్వానించిన చిరు నందమూరి ఫ్యామిలీని పిలవడం పోవడం సంచలనంగా మారింది. 

Advertisement
CJ Advs

వెంకీ, నాగార్జునలని ప్రత్యేకంగా కుటుంబంతో సహా ఆహ్వానించిన మెగాస్టార్ బాలయ్యని పిలవకపోవడంతో మెగాస్టార్ కి బాలయ్య అక్కర్లేదు, ఆయనతో స్నేహం అక్కర్లేదు అనేలా ఉంది ఆయన వ్యవహారం అంటున్నారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా చరణ్ బర్త్ డే పార్టీలో కనిపించడం పోవడం నందమూరి ఫాన్స్ ని హార్ట్ చేసింది. మరి చిరు కావాలనే అలా పిలవలేదో.. లేదంటే పిలిచినా బాలయ్య రాలేదో కానీ.. ఇప్పడూ ఇదే ముచ్చట టాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యింది.

ఇక మోహన్ బాబు ఫ్యామిలిలో మోహన్ బాబు, విష్ణు ఈ పార్టీలో కనిపించలేదు. మనోజ్ మాత్రం చరణ్ కి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పాడు. ఇక ఈ పార్టీలో ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలు కనిపించకపోవడం కూడా మెగా ఫాన్స్ కే షాకిచ్చింది.

Megastar Chiru avoids Nandamuri family:

Balakrishna missing at Ram Charan birthday bash?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs