Advertisement
Google Ads BL

ఏంటి చైతూ ఏదో తేడాగా ఉంది


నాగ చైతన్య ఈమధ్యన ఎక్కువగా న్యూస్ లో నిలుస్తున్నాడు. కారణం ఆయన జూబ్లీహిల్స్ లో ఇష్టపడి కట్టించుకున్న ఇంటి గురించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 15 కోట్లు విలువ చేసే ఇంటిని సకల సదుపాయాలతో.. లగ్జరిగా నాగ చైతన్య తండ్రి నాగార్జున నివాసానికి దగ్గరలోనే నిర్మించుకున్నాడు. అయితే సమంతతో విడాకులు తీసుకుని ఒంటరి వాడైన నాగ చైతన్య ఆ కొత్తింట్లోకి ఒంటరిగానే గృహ ప్రవేశం చేసాడు.  సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య పై బోలెడన్ని రూమర్స్ వచ్చాయి, ఆయన శోభిత దూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి.

Advertisement
CJ Advs

అసలు శోభితకి-నాగ చైతన్యకి లింగ్ ఎలా కలిసిందో అర్ధం కాక చాలామంది తెగ ఆలోచించేసారు. గతంలో వీరిద్దరూ వెకేషన్స్ కి వెళ్లారంటూ కొన్ని ఫొటోస్ వైరల్ కాగా.. వాటిని శోభిత కొట్టిపారేసింది. ఆ తర్వాత ఎవరి సినిమా షూటింగ్స్ తో వారు బిజీగా ఉన్నారు. నాగ చైతన్య రీసెంట్ ఫిలిం కష్టడి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం లండన్ వెకేషన్స్ కి వెళ్ళాడు. అదే లండన్ లో శోభిత కనిపించడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

అది కూడా చైతూ దిగిన హోటల్ లోనే శోభిత ఉండడం ఎలా సాధ్యం. సో చైతూ-శోభిత ఇద్దరూ డేటింగ్ లో ఉండబట్టే ఇలా లండన్ కి వెకేషన్స్ కి వెళ్లారంటూ మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. ఇక శోభిత-చైతూ కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో అక్కడి హోటల్ చెఫ్ తో చైతూ దిగిన పిక్ లో వెనుక టేబుల్ మీద శోభిత ఫేస్ దాచుకున్న పిక్ ని నెట్టింట వైరల్ చేసిపడేస్తున్నారు నెటిజెన్స్. ఇదంతా చూస్తే నిజంగానే ఏదో తేడా కొట్టడం లేదూ!

Naga Chaitanya With His Rumoured Girl Friend:

Naga Chaitanya Vacationing in London With An Actress
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs