యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో HCA అవార్డ్స్ కి వెళ్లలేకపోయినందుకే ఆయన ఫాన్స్ బాగా హార్ట్ అయ్యారు. ఇక ఎలాగో ఆస్కార్ టైమ్ కి ఖాళీ చేసుకుని ఎన్టీఆర్ అమెరికా వెళ్లి.. ఆస్కార్ పార్టీలు, అవార్డు వేడుకల తర్వాత హైదరాబాద్ కి సింగిల్ గానే వచ్చేసాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ లో భాగమైన రాజమౌళి, కీరవాణి, కార్తికేయ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, కొరియో గ్రాఫర్ ప్రేమ రక్షిత్, రామ్ చరణ్ అందరూ హైదరాబాద్ కి వచ్చేసారు. హైదరాబాద్ లో ఆర్.ఆర్.ఆర్ నాటు ఆస్కార్ పార్టీ ఓ లెవల్లో ఏర్పాటు చేస్తారని అనుకుంటే.. ఎవ్వరూ హడావిడి చెయ్యలేదు.
తాజాగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో మెగాస్టార్ ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ అందుకున్న వాళ్ళని ప్రత్యేకంగా సన్మానించారు. రామ్ చరణ్ బర్త్ డే పార్టీ లో రాజమౌళి ఆయన వైఫ్, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య, కాల భైరవ, కార్తికేయకి శాలువాలు కప్పి సత్కరించారు చిరు. అక్కడే చరణ్ కూడా ఉన్నాడు. కానీ ఈ స్పెషల్ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిస్ అయ్యాడు.
రామ్ చరణ్ బర్త్ డే కి సోషల్ మీడియా వేదికగా హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ అంటూ విష్ చేసాడు. కానీ రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో, ఆర్.ఆర్.ఆర్ సత్కార వేడుకలో ఎన్టీఆర్ ఒక్కడే మిస్ అయ్యాడు. చిరు ఆర్.ఆర్.ఆర్ టీమ్ ని సత్కరిస్తూ దిగిన గ్రూప్ పిక్ లో ఎన్టీఆర్ లేకపోవడం లోటుగా కనిపించింది. మరి ఎన్టీఆర్ మిస్ అవడానికి కారణం ఆయన నిన్నటినుండి NTR30 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే ఎన్టీఆర్-కొరటాల మూవీ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఏదో ఓ గంట ఎన్టీఆర్ చరణ్ బర్త్ డేలో భాగమవ్వాల్సింది అంటున్నారు ఫాన్స్.
ఇక ఈ బర్త్ డే పార్టీలో అల్లు ఫ్యామిలీ కానీ, నందమూరి ఫ్యామిలీ కానీ.. ప్రభాస్ ఇలా కొంతమంది సెలబ్రిటీస్ అయితే కనిపించలేదు. కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఈ పార్టీలో స్పెషల్ గా కనిపించింది.