Advertisement
Google Ads BL

ఉపాసన బేబీ బంప్ వీడియో వైరల్


రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడన్న క్షణం నుండి ఉపాసన రియల్ గా తల్లవుతుందా? లేదంటే చరణ్ దంపతులు సరోగసి ద్వారా పేరెంట్స్ అవుతున్నారా? అనే అనుమానాలు బోలెడంతమందిలో కలిగాయి. ఉపాసన పదేళ్ల తర్వాత శుభవార్త చెప్పడం మెగా ఫ్యామిలీని ఆనందంలో ముచ్చెత్తింది. ఈలోపు ఆమె ప్రెగ్నెంట్ పై వచ్చిన రకరకాల వార్తలు వారిని కాస్త ఇబ్బంది కూడా పెట్టాయి. ఉపాసన తల్లవుతుంది అని తెలిసాక మీడియా చాలాసార్లు ఆమె బేబీ బంప్ కోసం వెతికింది. కానీ ఉపాసన మాత్రం బేబీ బంప్ ఎక్స్ పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ దానిని కవర్ చేసే లూజైన అవుట్ ఫిట్స్ తో ఆ బేబీ బంప్ ని దాచేసింది.

Advertisement
CJ Advs

అమెరికాలో రామ్ చరణ్ తన వైఫ్ కి ఇప్పుడు ఆరో నెల అన్నాక కూడా చాలామంది అనుమానాలు వ్యక్తపరిచారు. ఆరో నెల వచ్చినా ఉపాసన బేబీ బంప్ కనిపించడమే లేదు అన్నారు. అయితే తాజాగా ఉపాసన బేబీ బంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామ్ చరణ్ బర్త్ డే సదంర్భంగా ప్రముఖులకి ఇచ్చిన పార్టీలో ఉపాసన టైట్ ఫిట్ లో బేబీ బంప్ కనిపించేలా సందడి చేసింది. ఆమెకి ఇప్పుడు ఆరో నెల కావడంతో స్పష్టంగా బేబీ బంప్ కనిపించడంతో మెగా ఫాన్స్ ఆనందంతో పండగ చేసుకుంటున్నారు.

మరో మూడు నెలలో రామ్ చరణ్-ఉపాసన పేరెంట్స్ గా మారబోతున్న తరుణంలో మెగా ఫ్యామిలీ ఎంతో ఆతృతగా ఉండగా.. చరణ్ అన్న ఎప్పుడెప్పుడు బిడ్డని ఎత్తుకుని పరిచయం చేస్తాడా అని మెగా ఫాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి మెగా వారసుడంటే.. మాములు విషయం కాదు కదా. 

Upasana baby bump video goes viral:

ram Charan wife  Upasana baby bump video goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs