Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫాన్స్ కి ఊపిరాడనివ్వడం లేదు


నిన్నమొన్నటివరకు #NTR30 అప్ డేట్ కోసం అల్లడిపోయిన ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇప్పుడు ఊరపి ఆడడమే లేదు. #NTR30 మొదలైంది మొదలు ఆ సినిమా గురించిన ప్రతి చిన్న విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి అందుబాటులో ఉంచేలా ప్లాన్ చెయ్యడంతో ఫాన్స్ ఉబ్బితబ్బైపోతున్నారు. #NTR30 ఓపెనింగ్ రోజునే సినిమా బ్యాక్డ్రాప్ ఎలా ఉండబోతుందో అనేది కొరటాల ఆల్మోస్ట్ రివీల్ చేసేసారు. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా, రత్నవేలు DOP, సాబు సిరిల్ ఇలా ప్రతి ఒక్కరూ #NTR30 పై అంచనాలు పెరిగేలా మాట్లాడారు. అయితే నిన్న ఉదయమే అనిరుధ్ రవిచంద్రన్-రత్నవేలు #NTR30 సెట్స్ లో ఉన్న పిక్స్ వదిలారు. 

Advertisement
CJ Advs

ఆదివారం అర్ధరాత్రి రాత్రి నుండే కొరటాల-ఎన్టీఆర్ సెట్స్ మీదకి వెళ్లిపోయారని, నిన్న సోమవారం నుండే #NTR30 రెగ్యులర్ షూట్ మొదలైపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ రోజు ఉదయమే #NTR30 నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ 11 గంటలకి రెడీగా ఉండండి అని చెప్పిన కాసేపటికే #NTR30 నుండి పవర్ ఫుల్ అప్ డేట్ ఇచ్చేసారు. #NTR30లో కీలకమైన సన్నివేశాలకు బ్రాడ్‌మిన్నిచ్ VFX సూపర్‌వైజర్‌గా ఉంటారు.. అంటూ కొరటాల బ్రాడ్‌మిన్నిచ్ తో ముచ్చటిస్తున్న పిక్ వదిలారు. 

బిగ్ స్క్రీన్‌లలో అద్భుతమైన విజువల్ ట్రీట్ కోసం సిద్ధంగా ఉండండి.. అంటూ మేకర్స్ ఇచ్చిన పవర్ ఫుల్ అప్ డేట్ తో ఎన్టీఆర్ ఫాన్స్ మరింతగా హుషారవుతున్నారు. నిన్నమొన్నటివరకు అప్ డేట్ కోసం ఆశగా ఎదురు చూసిన ప్రతిసారి డిస్పాయింట్ అయిన ఎన్టీఆర్ ఫాన్స్.. ఇప్పుడు #NTR30 మేకర్స్ వదులుతున్న అప్ డేట్స్ మాకు ఊపిరి ఆడనివ్వడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

Brad Minnich will be the VFX supervisor for crucial sequences in NTR30:

 NTR30 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs