Advertisement
Google Ads BL

మాస్ లుక్ లో రామ్.. డేట్ తో సహా వచ్చాడు


హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హిట్ కొట్టేసాడు. ఆతరవాత రెడ్ మూవీతో రాంగ్ స్టెప్ వేసాడు. ఆ చిత్రం రామ్ కి షాక్ ఇచ్చింది. ఆపై తెలుగు తమిళ్ లో చేసిన వారియర్ కూడా రామ్ ని నిరాశపరిచింది. ద వారియర్ తర్వాత రామ్, అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటితో హితులు కలిపి పాన్ ఇండియా మూవీని ఎనౌన్స్ చేసి వెంటనే సెట్స్ లోకి వెళ్ళిపోయాడు. రామ్ ని మాసివ్ అవతార్ లో బోయపాటి చూపించబోతున్నారని రామ్ హెయిర్ స్టయిల్, ఆయన గెడ్డం లుక్ చూసినప్పుడే అర్ధమైంది.

Advertisement
CJ Advs

తాజాగా #BoyapatiRapo టైటిల్ ఇవ్వకుండా ఊరిస్తూనే.. ఎలాంటి హడావిడి లేకుండా రామ్ ఫస్ట్ లుక్ తో పాటుగా.. రిలీజ్ డేట్ వదిలారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రామ్ తన చేతితో గంగిరెద్దు (ఎద్దు)ని లాగుతూ పోస్టర్‌ లో రగ్డ్, మాస్‌ గా కనిపిస్తున్నారు. డెనిమ్స్‌ షర్టు, జీన్స్‌ లో క్లాస్‌ గా, ఫ్యాషనబుల్‌ గా కనిపిస్తున్నప్పటికీ, అతని ముఖంలో వైల్డ్ నెస్ కనిపిస్తుంది. బోయపాటి శ్రీను రామ్‌ ని మాస్ క్యారెక్టర్‌ లో చూపిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా స్పెషల్ గా అక్టోబర్ 20న పాన్ ఇండియాలోని పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించేసారు.

పండగా లేదు పబ్బం లేకుండానే సైలెంట్ గా మహేష్ SSMB28 రిలీజ్ డేట్ నిన్న ప్రకటించగా.. ఇప్పుడు రామ్ -బోయపాటి చిత్ర రిలీజ్ డేట్ ని కామ్ గా లాక్ చేసి వదిలారు. ఇక దసరా బరిలో నిలబోయే మొదటి సినిమాగా #BoyapatiRapo చిత్రం నిలిచింది. అంటే దసరా హాలిడేస్ ని రామ్ ముందుగా డేట్ లాక్ చేసి వాడెయ్యడానికి రెడీ అయ్యిపోతున్నాడు. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన యంగ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.  

BoyapatiRAPO Releasing Worldwide On October 20th:

Boyapati Sreenu, Ram Pothineni BoyapatiRAPO Releasing Worldwide On October 20th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs