Advertisement
Google Ads BL

వావ్ అనిపిస్తున్న గేమ్ ఛేంజర్ చరణ్ ఫస్ట్ లుక్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అందుకున్న క్రేజ్ ని నిలబెట్టేలా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ RC15 ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్-శంకర్ కలయికలో ఏడాదిన్నర క్రితమే మొదలైన RC15 కి సంబందించిన టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని ఈ రోజు మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసారు. శంకర్ తో రామ్ చరణ్ సినిమా అనగానే అందరిలో అంచనాలు మొదలయ్యాయి.. ఆ అంచనాలు తగ్గట్టే శంకర్ టైటిల్ ఎవరి ఊహలకి అందని విధంగా ఫిక్స్ చేసారు. ఈ రోజు ఉదయం 8.30 కి RC15 టైటిల్ గేమ్ ఛేంజర్ అంటూ రివీల్ చేసారు.

Advertisement
CJ Advs

మూడు లాంగ్వేజెస్ కి రీచ్ అయ్యేలా ఈ  పవర్ ఫుల్ టైటిల్ ఉండగా.. సాయంత్రం 3 గంటలకు రామ్ చరణ్ లుక్ కూడా రివీల్ చేసి మెగా ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికే RC15 నుండి రామ్ చరణ్ స్టూడెంట్ లుక్, సైకిల్ మీద వెళుతున్న నడి వయస్కుడి లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. గేమ్ ఛేంజర్ గా రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో అని మెగా ఫాన్స్ ఉదయం నుండి తెగ ఎదురు చూస్తున్నారు. మరి మెగా ఫాన్స్ అంచనాలు, గ్లోబ్ స్టార్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఉంది.

రామ్ చరణ్ బైక్ పై కూర్చుని వెనుకగా చూస్తున్న లుక్ లో చాలా స్టైలిష్ గా అదిరిపోయే హెయిర్ స్టయిల్లో దర్శనమిచ్చాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లుక్ చూసి మెగా ఫాన్స్ కి తెగ సర్ ప్రైజ్ అవుతున్నారు. అస్సలు ఊహించని లుక్ లో చరణ్ బాగా ఇంప్రెస్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఈ లుక్ చూసిన రామ్ చరణ్ నా బర్త్ డే కి బెస్ట్ గిఫ్ట్.. థాంక్యూ శంకర్ సర్ అంటూ ట్వీట్ చేసాడు.

Game Changer First Look:

Ram Charan Birthday Special: Game Changer First Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs