Advertisement
Google Ads BL

అన్న విష్ణుతో గొడవపై మనోజ్ కామెంట్స్


మంచు విష్ణుతో మంచు మనోజ్ తీవ్రంగా విభేదిస్తున్నాడు అనే విషయం సోషల్ మీడియాలో తేటతెల్లమైంది. అన్నద్మముల మధ్యన చిన్న చిన్న గొడవలుంటే తండ్రి సమక్షంలో కూర్చుని పరిష్కరించుకోవాలి గాని.. మనోజ్ ఇలా విష్ణుపై వీడియోని చిత్రీకరించి పబ్లిక్ చేయడంపై చాలామంది విమర్శిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు చెప్పినట్టుగా ప్రతి ఇంట్లోనూ అన్నదమ్ముల మధ్యన ఆర్థికపరమైన, ఈగో క్లాషెస్ ఉంటాయి. కానీ వీరు సెలబ్రిటీస్ అవడం, సమాజంలో ప్రముఖ కుటుంబమవడంతో అది మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement
CJ Advs

మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి లు మనోజ్ వీడియోపై, అన్నదమ్ముల గొడవ అంటూ ఎవరి స్టయిల్లో వారు స్పందించగా.. తాజాగా మనోజ్ ఓ మూవీ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లగా అక్కడ మీడియాతో.. తన కొత్త సినిమా మరో వారంలోనే మొదలవుతుంది, ఎనౌన్సమెంట్ వస్తుంది. దానితో పాటుగా వాట్ ద ఫిష్ కూడా. ప్రస్తుతం తాను కొత్త జీవితాన్ని ఆరంభించాను, ఇకపై అంతా సినిమానే, నాకు సినిమాలంటే ప్రాణం.. సినిమానే నా జీవితం, ఇకపై సినిమాలే నా ప్రపంచం, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, ఎప్పటిలాగే నన్ను ఆశీర్వదించండి అని చెప్పగా.. మీడియా వారు అన్న విష్ణు వ్యవహారంపై స్పందించమని కోరారు. నవ్వుతూ.. నాకంటే టీవీ 9 వాళ్ళకి బాగా తెలుసండి, వాళ్ళని అడిగితే చెబుతారంటూ సమాధానం దాటవేశారు.

కానీ మనోజ్ మాత్రం తాను విష్ణు గొడవపై స్పందించలేను అని మొహమాటం లేకుండా చెప్పేసినట్లే కనిపించింది. అంటే మంచు మనోజ్ కి అన్నపై చాలా కోపం ఉంది అనుకోవాలా.. లేదంటే ఈ గొడవ చిన్నదే.. దాని కోసం స్పందించాల్సిన అవసరం లేదు అనుకున్నాడో కాని.. అన్న విష్ణు తో జరిగిన గొడవపై మంచు మనోజ్ మీడియా ముందు మాట్లాడడానికి ఇష్టపడలేదు.

Manchu Manoj comments on the fight with Anna Vishnu:

Manchu Manoj avoids Manchu Vishnu issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs