Advertisement
Google Ads BL

అన్నతో ఇష్యూ.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్


మంచు మనోజ్ అన్న విష్ణుతో విభేదిస్తున్న విషయం సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసేసాడు. గత కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల్లో మంచు మనోజ్ కి మంచు విష్ణుకి పడడం లేదనే విషయాన్ని నిజం చేస్తూ వీరి మధ్యన విభేదాలు ఓ వీడియో సాక్షిగా బయటపడింది. అన్న విష్ణు దౌర్జన్యాలంటూ మనోజ్ వీడియో లీక్ చేసి విష్ణుకి మోహన్ బాబుకి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చాడు. మోహన్ బాబు, విష్ణులు ఇద్దరూ ఇది అన్నదమ్ముల వ్యవహారం, పెద్ద గొడవ కాదు అన్నప్పటికీ.. మంచు మనోజ్ మాత్రం బ్రతకండి, బ్రతకనివ్వండి అంటూ కొటేషన్స్ తో అన్నని ఇంకా బజారుకీడుస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఇక గత రెండురోజులుగా మంచు ఫ్యామిలీ వ్యవహారం మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. మంచు విష్ణు.. మనోజ్ తల్లిని తీసుకుని మనోజ్ ఇంటికి వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నాలు చేసాడనే టాక్ కూడా నడుస్తుంది. మోహన్ బాబు అన్నదమ్ముల మధ్యన రాజి కుదర్చలేకపోవడంతో మనోజ్ తల్లిని విష్ణు రంగంలోకి దింపాడంటున్నారు. అదలాఉండగా.. అన్నతో గొడవ జరిగిన రోజే తన పెళ్లి పార్టీని అక్క మంచు లక్ష్మి ఇంట్లో ఫ్రెండ్స్ కలిసి చేసుకున్న మనోజ్ ఈ సన్ డే ని తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసాడు.

Had a Super Sunday with my darling brothers @dirbobby,  @DirVamsee, @KiranGirajala, #Viren :) Loved our conversations & Thank you all for bringing my fav food from ur sweet homes 🙏🏼❤️ Wishing to have many more of these 🙏🏼 #BrothersForever #WonderfulSouls అంటూ దర్శకుడు బాబీ.. ఇంకా ఇతర ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే.. అదేమిటి మనోజ్ అన్నతో గొడవలు అలా జరుగుతున్న వేళ ఫ్రెండ్స్ తో కలిసి నువ్విలా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Issue with Anna.. Enjoy with friends:

Manchu Manoj enjoying this sunday with his friends
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs