Advertisement
Google Ads BL

RC15: చరణ్, శంకర్ సినిమా టైటిల్ ఇదే..


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్ర టైటిల్‌ను.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’గా టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో ఇన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్‌పై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయింది. అయితే ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఆ సర్‌ప్రైజ్ మధ్యాహ్నం 3గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నారు. బహుశా అది.. ఈ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ అని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన టైటిల్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ టైటిల్ రివీలింగ్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. 

Advertisement
CJ Advs

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు‌ను పురస్కరించుకుని సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఆదివారం అభిమానుల సమక్షంలో జరిగిన వేడుకకు నిర్మాత దిల్ రాజు హాజరవడమే కాకుండా.. RC 15 టైటిల్‌కు సంబంధించి నాలుగు ఆప్షన్స్‌తో ఓ మల్టీపుల్ చాయిస్ ప్రశ్నను అభిమానులకు సంధించారు. అందులో ఆప్షన్ A. సర్కారోడు, B. సీఈఓ C. గేమ్ ఛేంజర్ D. అది మాత్రం సస్పెన్స్! అంటూ స్టేజ్‌పై దిల్ రాజు పిచ్చ హ్యాపీగా చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు వినిపించిన ఈ మూడు టైటిల్స్ కాదనేలా టాక్ మొదలైంది. తాజాగా ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ విడుదల చేసింది. దిల్ రాజు చెప్పిన ఆప్షన్ C నే ఈ సినిమా టైటిల్‌గా రివీల్ చేశారు. ఈ సంస్థకు ఇది 50వ చిత్రం. 

‘వినయ విధేయ రామ’ చిత్రం తర్వాత మరోసారి రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల  రామ్ చరణ్, కియారాపై ఓ పాట‌ను కూడా చిత్రీక‌రించారు. ఈ పాట‌కు ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా మాస్ట‌ర్ నృత్య రీతుల్ని స‌మ‌కూర్చారు. ఈ పాట పూర్త‌యిన సంద‌ర్భంగానే యూనిట్ మొత్తం ఆర్సీ 15సెట్లో రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను వైభ‌వంగా జ‌రిపింది. అంతకు ముందు ఆస్కార్ నుంచి వచ్చిన చరణ్‌కు దాదాపు 500 డ్యాన్సర్స్‌తో ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేస్తూ యూనిట్ గ్రాండ్ వెల్‌కమ్ పలికింది.

Ram Charan and Shankar Combo Film Title is Game Changer :

RC 15 Title Revealed in Occasion of Ram Charan Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs