Advertisement
Google Ads BL

ప్రభాస్ vs మహేష్ vs చరణ్ vs పవన్


రోజురోజుకి ఉత్కంఠ పెరిగిపోతుంది. ఎందుకంటే వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ పడే సినిమాల లిస్ట్ ఇప్పుడిప్పుడే లైన్ లోకి ఇంట్రెస్ట్ ని పెంచేస్తున్నాయి. అందరికన్నా ముందే ప్రభాస్ పాన్ ఇండియా ఫిల్మ్ ప్రాజెక్ట్ K జనవరి 12న విడుదల చెయ్యబోతున్నట్టుగా నాగ్ అశ్విన్-అశ్విని దత్ లు నిర్ణయించి తేదీని ప్రకటించారు. సంక్రాంతికి రాబోయే మొదటి మూవీగా ప్రాజెక్ట్ K నిలిచింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2024 సంక్రాంతికే అన్నారు. అది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఈ మధ్యలో రామ్ చరణ్-శంకర్-దిల్ రాజుల పాన్ ఇండియా ఫిల్మ్ RC15 కూడా సంక్రాంతి కి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చ్ 27న ప్రకటిస్తారంటున్నారు. అది మరికొద్ది గంటల్లోనే రివీల్ కాబోతుంది. ఈలోపే SSMB28 మేకర్స్ హడావిడిగా మహేష్ మాస్ లుక్ ని రివీల్ చేస్తూ 2024 జనవరి 13న సినిమా రిలీజ్ అంటూ పోస్టర్ వేశారు. ఉగాదికి రావాల్సిన అప్ డేట్ కరెక్ట్ గా రామ్ చరణ్ బర్త్ డే ముందు ఇవ్వడంలో మేకర్స్ ఆంతర్యమేమో కానీ.. ఇప్పుడు రామ్ చరణ్-శంకర్ RC15 డేట్ పై అనుమానాలు మొదలయ్యాయి. 

అయితే సంక్రాంతికి.. లేదంటే పోటీ ఎందుకులే.. అందులో దిల్ రాజు నైజాంలో SSMB28 రిలీజ్ చేస్తారు. ఆయన సినిమాకి ఆయనే పోటీ ఇవ్వరు అనే డౌట్ ఇప్పుడు అందరిలో మొదలయ్యింది.  vsRC15 అయితే సమ్మర్ కి షిఫ్ట్ అవ్వొచ్చనే ఊహాగానాలతో మెగా ఫాన్స్ డల్ అవుతున్నారు. మరి రేపు చరణ్ బర్త్ డేకి రాబోయే ఆ రెండు అప్ డేట్స్ పై ఫాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. 

అయితే 2024 సంక్రాంతి పోటీ ఈసారి మాములుగా ఉండదు. ప్రభాస్ vs మహేష్ పవన్ vs చరణ్ అన్నట్టుగా ఉంటే.. ఆడియన్స్ మాత్రం పండగే పండగ అంటున్నారు. నిజమే మరి.. ఈ సంక్రాంతి ఫైట్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటే నమ్మలేకపొతున్నారు.

Prabhas vs Mahesh vs Ram Charan vs Pawan Kalyan:

Prabhas vs Mahesh fix in Sankranthi 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs