Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ ఫాన్స్ కి మాస్ ఫీస్ట్


నిర్మాత నాగ వంశీ ఈ రోజు సాయంత్రం 5.04 నిమిషాలకు బిగ్ అప్ డేట్ రాబోతుంది అంటూ ఊరిస్తూనే ఆ 5.04 కి అప్ డేట్ ఇవ్వకుండా ఫాన్స్ ని బాగా వెయిట్ చేయించడమే కాదు.. వారికి బాగా కోపం తెప్పించాడు. అయ్యో తిట్టకండి ఆరు గంటల వరకు రాహుకాలమంట .. 6 తర్వాతే మన అప్ డేట్ అంటూ మరో ట్వీట్ వేశారు. 6 అయ్యింది.. అయినా అప్ డేట్ లేదు.. 6.30 ki memu ready ga untam u guys can plan ur records boys.. అంటూ మరో ట్వీట్ వేసాడు.

Advertisement
CJ Advs

ఇక 6.30 వరకు మహేష్ ఫాన్స్ తో పాటుగా ఆయన నిర్మిస్తున్న సినిమాల హీరోల ఫాన్స్ బాగా ఎగ్జైట్ అయ్యారు. ఏ అప్ డేట్ వస్తుందో తెలియక. ఇక ఆగష్టు 11న మహేష్-త్రివిక్రమ్ కాంబో SSMB28 రిలీస్ ఉంటుంది అంటూ మొన్నామధ్యన నాగవంశీ ఓ సినిమా ప్రమోషన్స్ లో చెప్పగానే అమ్మో ఇంత త్వరగా మహేష్ మూవీ రిలీజ్ అవుతుందా అని మహేష్ ఫాన్స్ సంబరపడ్డారు. కానీ ఆ డేట్ మారొచ్చనే ఊహాగానాలకు ఊతమిస్తూ మెగాస్టార్ చిరు భోళా శంకర్ తో ఆగష్టు 11న కచ్చిఫ్ వెయ్యగానే, మహేష్ మూవీ ఆగస్టు 11 ఉండదు.. వచ్చే ఏడాది జనవరి సంక్రాంతికి వెళ్ళిపోతుంది అన్నారు.

అన్నట్టుగానే వచ్చే ఏడాది అంటే 2024 జనవరి 13న మహేష్-త్రివిక్రమ్ SSMB28 మూవీ రిలీజ్ అంటూ నాగ వంశీ ట్వీట్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 28తో సరికొత్త మాస్ అవతార్‌లో జనవరి 13, 2024 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో అలరించనున్నారు అంటూ విడుదల చేసిన పోస్టర్ అసలుసిసలైన సంక్రాంతి సినిమాని తలపిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు సరికొత్త మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ ని బట్టి చూసే ఇది మిర్చి యార్డ్ లో జరిగే యాక్షన్ సన్నివేశమని అనిపిస్తోంది. మిర్చి యార్డ్ లో కొందరికి బుద్ధిచెప్పి.. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్ తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి మాస్ బొమ్మ చూపించబోతున్నారని పోస్టర్ తోనే అర్థమవుతోంది.

మహేష్ బాబు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు నటించిన ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం అల వైకుంఠపురములో సైతం 2020 సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం విశేషం. అసలే హ్యాట్రిక్ కాంబినేషన్, అందులోనూ సంక్రాంతి సీజన్ కావడంతో ఎస్ఎస్ఎంబి 28 చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

Super Star Mahesh in an all new MASS avatar:

SSMB28 in theatres from 13th January 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs