బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడుకులకి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అలియా భట్ సీతగా ఆకట్టుకుంది. బాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలతో అద్భుతమైన పెర్ఫఫార్మెన్స్ ఇస్తూ టాప్ హీరోయిన్ గా గ్లామర్ షో చెసే అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ లో సీత కేరెక్టర్ లో పదహారణాల తెలుగమ్మాయిలా తెలుగు ప్రేక్షకుల మనసులని దోచేసింది. NTR30 లో ఎన్టీఆర్ కి జోడిగా అలియా భట్ హీరోయిన్ గా ఫైనల్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చేసారు మేకర్స్.
కానీ అలియా భట్.. పెళ్లి, పిల్లల కారణంగా ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అయితే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్-చరణ్ లతో బాగా క్లోజ్ గా కనిపించిన అలియా వారితో ఫ్రెండ్ షిప్ ని మెయింటింగ్ చేస్తుంది. తాజాగా తన కంపెనీలో తయారయ్యే కొత్త దుస్తులని ఎన్టీఆర్ కొడుకులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లకి పంపి ఎన్టీఆర్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. యు ఆర్ మై ఫెవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి, పిల్లల పేర్లతో టాగ్స్ పెట్టి వాటిని ఎన్టీఆర్ కుమారులకు పంపించింది అలియా.
దానితో ఎన్టీఆర్ అలియాకి థాంక్స్ చెప్పడమే కాదు.. త్వరలోనే నా పేరుతో ఓ బ్యాగ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం అలియా భట్ స్వీట్ సర్ ప్రైజ్ కి ఫిదా అవుతున్నారు.