Advertisement
Google Ads BL

అఖిల్-థమన్ చితకొట్టేశారు


అఖిల్ హీరోగా ఎంతమంది అభిమానం చూరగొన్నాడో తెలియదు కానీ.. క్రికెటర్ గా మాత్రం అందరి మనసులని దోచెయ్యడమే కాదు.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అఖిల్ ఎందుకు సినిమాల్లోకి వచ్చాడు.. చక్కగా క్రికెట్ ని ఎంచుకుంటే.. టాప్ క్రికెటర్ అయ్యేవాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సెలెబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)లో అఖిల్ ఆటతీరుకి అందరూ ఫిదా అవుతున్నారు. 2025 లో మొదలైన CCL నుండి మూడుసార్లు విజేతలు నిలిచిన తెలుగు వారియర్స్ ని మరోసారి విజేతగా నిలబెట్టారు అఖిల్ అండ్ థమన్ లు. 

Advertisement
CJ Advs

భోజ్‌పురీ దబాంగ్స్‌తో జరిగిన ఫైనల్లో గెలిచిన తెలుగు జట్టు నాలుగోసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 విజేతగా నిలిచింది. విశాఖ వేదికగా జరిగిన ఫైనల్లో మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్.. తొలి ఇన్నింగ్స్‌లో భోజ్‌పురీ దబాంగ్స్‌ ని 6 వికెట్ల నష్టానికి 72 పరుగులకే పరిమితం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ కు 32 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌ లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. 

ఈ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ లాంటి స్టార్స్ హాజరయ్యి హంగామా చేసారు. ఈ సీజన్ లో మంచి ఆటతీరు కనబర్చిన అఖిల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది మ్యాచ్, ఎంటర్‌టైనర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు. అసలు ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్ కి చేరిన భోజ్‌పురీ దబాంగ్స్‌ ని ఫైనల్స్ లో తెలుగు వారియర్స్ మట్టి కురిపించింది.

CCL: Telugu Warriors win the title for the fourth time:

CCL: Akhil Telugu Warriors creates history
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs