యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ఫీవర్ నుండి NTR30 ఓపెనింగ్ లోకి వచ్చేసారు. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ అయ్యాక ఏడాది గ్యాప్ తో కొత్త సినిమాని రీసెంట్ గానే కొరటాల శివ దర్శకత్వంలో మొదలు పెట్టారు. గత ఏడాది ఇదే సమయానికి ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో రామ్ చరణ్ తో పాటుగా రాజమౌళి తో కలిసి పాల్గొన్న ఎన్టీఆర్ ఇదే రోజున తన భార్య లక్ష్మి ప్రణతి బర్త్ డే ని కూడా అంతే ఆనందంతో సెలెబ్రేట్ చేసుకున్నాడు.
రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రణతి బర్త్ డే 26.. నా బర్త్ డే 27. ప్రణతి బర్త్ డే 26 నైట్ ఎన్టీఆర్ గేటు దాటి నా బర్త్ డే సెలెబ్రేషన్స్ కి వచ్చేస్తాడు.. పాపం ప్రణతి నన్ను ఎంత తిట్టుకుంటుందో.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేసాడు. ఇక ఈ రోజు మార్చి 26 తన భార్య ప్రణతి బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ క్యూట్ గా విష్ చేస్తూ ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. Happy birthday ammalu…❤️❤️ హ్యాపీ బర్త్ డే అమ్మలు అంటూ భార్యని ఎంతో క్యూట్ గా స్వీట్ గా విష్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
డిసెంబర్ చివరిలో ఎన్టీఆర్ తన భార్య పిల్లలు తో కలిసి అమెరికా వెకేషన్స్ కి వెళ్లి అక్కడే ఆర్.ఆర్.ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ కి మాత్రం ఎన్టీఆర్ ఒంటరిగానే వెళ్ళాడు. అక్కడి హాలీవుడ్ మీడియా భార్య ప్రణతిని తీసుకురాలేదేమిటి అని అడిగితే.. తన భార్య ప్రణతి పిల్లలని చూసుకోవడానికి ఉండిపోయింది అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న యంగ్ టైగర్ వైఫ్ లక్ష్మి ప్రణతికి సినీజోష్ టీం తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.