Advertisement
Google Ads BL

మంచు లక్ష్మి కుమార్తె విద్యకి ప్రమాదం


మంచు, మంచు మీడియాలో ఎక్కడ చూసినా, యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తుంది. కారణం మంచు అన్నదమ్ములైన విష్ణు, మనోజ్ మధ్యన జరిగే గొడవలు ఇప్పుడు పబ్లిక్ అయ్యాయి. గుట్టుగా ఉంచాల్సిన గొడవలు బజారున పడడంతో వారి ఫ్యామిలీ విషయాలు వివరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ లు యూటుబ్స్ లో కూర్చుకుని ఇంటర్వూస్ ఇస్తూ హడావిడి చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మంచు లక్ష్మి కుమార్తె విద్య నిర్వాణకి జరిగిన ప్రమాదం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే మంచు లక్ష్మి కూతురు విద్యకి మోహన్ బాబు బర్త్ డే రోజునే ప్రమాదం జరగగా.. అది ఇప్పుడు ఆలస్యంగా బయటికి వచ్చింది. నిన్న లక్ష్మి ఇంట్లో మనోజ్ పెళ్లి పార్టీ ఇచ్చింది లక్ష్మి. ఆ వీడియోలో విద్య తలకి బ్యాండ్ ఎయిడ్ కనిపించింది. అయితే విద్యకి ఆ దెబ్బ ఎలా తగిలిందో మంచు లక్ష్మి తాజాగా వివరించింది.

తిరుపతి లో MBU యూనివర్సిటీలో మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో పిల్లలంతా బగ్గీ లో ప్రయాణిస్తుండగా అది అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిందట. దాంతో బగ్గీలో పిల్లలంతా కిందపడిపోయారట. ఆ బగ్గీలో మంచు లక్ష్మీ కూడా ఉందట. కానీ ప్రమాదం సమయంలో ఆమె చాకచక్యంగా పక్కకు దూకేయ్యగా.. పిల్లలు మాత్రం కిందపడిపోయారట. లక్ష్మి లేచి పరిగెత్తే సమయానికే విద్యా నిర్వాణ మొహం నిండా  రక్తంతో కనిపించిందట. దానితో లక్ష్మి ఎమోషనల్ అవుతూ.. పాపని గుర్రపు బండి ఎక్కించుకాకుండా ఉంటే బాగుండేది. అలా చేయడం వల్ల  తనకు కుట్లు పడ్డాయి అని విద్య కి జరిగిన ప్రమాదం గురించి చెప్పుకొచ్చింది.

Manchu Lakshmi daughter meets with an accident:

Manchu Lakshmi daughter Vidya Nirvana meets with an accident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs