Advertisement
Google Ads BL

న్యూ లుక్ లో కింగ్ నాగ్


నాగార్జున గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 6 ముగిసాక మళ్ళీ అంతగా మీడియాలో కనిపించలేదు. ద ఘోస్ట్ పరాజయం తర్వాత కొత్త ప్రాజెక్ట్ ని మొదలు పెట్టలేదు. ఆరు నెలలు గ్యాప్ తీసుకుని సినిమా చేస్తానా? లేదంటే డిజిటల్ ఎంట్రీ ఇస్తానా? అనేది చెబుతా అంటూ ఘోస్ట్ ఇంటర్వ్యూలోనే నాగ్ చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా ముగించారు. ఇప్పుడు ఆయన అనుకున్న ఆరు నెలలు పూర్తయ్యాయి. తాజాగా నాగార్జున మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. 

Advertisement
CJ Advs

అలాగే ఆయన కొత్త కథలు కూడా వింటున్నారని.. త్వరలోనే నాగార్జున కొత్త ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వస్తుంది అంటున్నారు. ప్రస్తుతం ఆయన కొడుకు అఖిల్ ఏజెంట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సురేందర్ రెడ్డి అండ్ ఏజెంట్ టీం తో బిజీగా వున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొద్దిరోజులుగా మీడియా కంటపడని నాగార్జున లుక్ ఒకటి బయటికి వచ్చింది. అందులో కింగ్ నాగ్ కొత్తగా కనిపిస్తున్నారు. హెయిర్ స్టయిల్, అలాగే గెడ్డం అన్ని కొత్తగానే ఉన్నాయి. 

అయితే నాగార్జున న్యూ లుక్ కొత్త ప్రోజెక్ట్ కోసమా.. లేదంటే మారేదన్నా కొత్త విషయం చెబుతారా.. అని అక్కినేని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. అన్నట్టు నాగార్జున ఈమధ్యన పూజ హెగ్డే  తో నటించిన మాజా యాడ్ అందరిని ఆకట్టుకుంది.

Nagarjuna new look steals hearts:

King Nagarjuna new look viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs