Advertisement
Google Ads BL

మంచు మనోజ్ ట్వీట్స్ విష్ణు ని ఉద్దేశించేనా?


మంచు మనోజ్-మంచు విష్ణు మధ్యన గొడవ. ఇప్పుడిదే సిసినిమా ఇండస్ట్రీలోను, మీడియాలోనూ హాట్ టాపిక్. ఆస్తుల విషయంలో బేధాభిప్రాయాలతో మనోజ్ కొంతకాలంగా మోహన్ బాబుకి విష్ణుకి దూరంగా అక్క లక్ష్మికి దగ్గరగా ఉంటున్నాడు అనే వార్త ఉంది. మనోజ్ కి విష్ణు కి మధ్యన మనస్పర్థలు ఉన్నాయనే విషయం మీడియాలో వినిపిస్తున్నా, మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ అప్పుడు అవి బయటికి కనిపించినా, మోహన్ బాబుని అడిగినా ఆవాటన్నిటిని తేలిగ్గా కొట్టి పారేసారు కానీ.. విషయం బయటికి రానివ్వలేదు.

Advertisement
CJ Advs

కానీ మనోజ్-విష్ణుల మధ్యన అభిప్రాయబేధాలు కాదు.. వారి మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటున్న విషయం మీడియా సాక్షిగా తేటతెల్లమైంది. విష్ణు అరాచకాలని వీడియో రూపంలో మనోజ్ లీక్ చేసాడు. మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి ఇది చిన్న విషయమని కొట్టిపారేసినా.. మనోజ్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ అన్న విష్ణు పై నెగెటివ్ గా రకరకాల ట్వీట్స్ ఇండైరెక్ట్ గా పెడుతున్నాడు అనిపిస్తుంది.

కళ్ల ముందు తప్పులు జ‌రుగుతుంటే చూసీచూడనట్టు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే అంటూ ఓ ట్వీట్, క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు అని ఓ ట్వీట్, మీరు బతకండి, ఇతరులను కూడా బతకనివ్వండి అంటూ దణ్ణం పెడుతున్న ఎమోజిలను షేర్ చేసాడు. అంటే అన్నకి సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నాడా..? లేదంటే విష్ణుపై ఉన్న కోపాన్ని ఇలా చూపించాడా అనేది ఇప్పుడు నెటిజెన్స్ కి పజిల్ లా మారింది.

Are Manchu Manoj tweet referring to Vishnu?:

Manchu Manoj says live and let live as he shares cryptic tweet 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs