హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ దసరా ఏప్రిల్ 30 శ్రీరామనవమి సందర్భంగా పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదలకు సిద్దమైంది. అసలు దసరా సినిమా ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అనే విషయం టీజర్, ట్రైలర్ లోనే చూపించేసినా.. నాని సోలో గా అన్ని భాషల్లో చేస్తున్న దసరా ప్రమోషన్స్ తోనే సినిమాపై భీభత్సమైన క్రేజ్ మొదలయ్యింది. హైదరాబాద్, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ అబ్బో నాని సింగిల్ ప్రమోషన్స్ తో దున్నేస్తున్నాడు. రాజమౌళి టీం మొత్తం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ పెంచితే.. నాని సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టుగా దసరా ప్రమోషన్స్ ఒంటరిగానే చేసేస్తున్నాడు.
హీరోయిన్ కీర్తి సురేష్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అప్పుడప్పుడు నాని తో జాయిన్ అవుతున్నారు. అయితే వచ్చే గురువారం విడుదలకు సిద్దమైన దసరా మూవీకి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. నాని దసరాకు ఏకంగా 36 కట్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంటర్వెల్ కి ముందు 20 సీన్స్, ఇంటర్వెల్ తర్వాత 16 సన్నివేశాలని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు మేకర్స్ ని ఆదేశించినట్టుగా ప్రచారమైతే గట్టిగా జరుగుతుంది. అలాగే అసభ్యకరమైన సన్నివేశాలను మ్యూట్ చెయ్యాలని, ఇంకా ధూమపానం, మద్యపానం ప్రాణాలకి ప్రమాదం అనే క్యాప్షన్ ఫాంట్ సైజు కూడా పెంచమని చెప్పిందట.
దసరాకి 36 కట్స్ కాదు.. కేవలం 16 కట్స్ మాత్రమే సెన్సార్ బోర్డు చెప్పింది అని మరో వాదన కూడా వినిపిస్తుంది. అదలావుండగా వైలెన్స్ సన్నివేశాలని సీజీలో కవర్ చెయ్యమని చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ యాస తో తెరకెక్కిన ఈ సినిమాలో (బాంచత్) బాంచన్ అన్న పదమే బూతు అన్నట్టుగా మీడియా వారు అడిగితే.. అది బూతు కాదు కూడా క్లారిటీ ఇచ్చాడు నాని. మరి దసరాలో ఇన్ని కట్స్ అంటే.. ఆడియన్స్ ఎలా ఫీలవుతారో చూడాలి.